ఆంధ్రప్రదేశ్:అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గంలో కోసువారిపల్లి( కొసువారిపల్లి ) గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న గుట్టమీదపల్లి గ్రామం దయనీయ స్థితిలో ఉంది.సుమారు 200 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ గ్రామంలో ఒకప్పుడు 500 మంది జనాభా నివసిస్తున్నారు, ప్రస్తుతం తాగునీరు,కనీస సౌకర్యాలు లేక ప్రజలు ఒక్కొక్కరుగా గ్రామాన్ని విడిచి వెళ్లిన పరిస్థితి నెలకొంది.
గ్రామ ప్రజలకు గుక్కెడు తాగునీరు కూడా లేని అధికారులు, ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యంపై స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంటూ గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు.అభివృద్ధి పేరుతో కాంట్రాక్టర్ బిల్లుల కోసమే ఈ పనులు చేస్తున్నారా.? లేక అధికారుల నిర్లక్ష్యానికి ఇదే నిదర్శనమా.? అని ప్రజలు మండిపడుతున్నారు.ప్రస్తుతం గ్రామం అంధకారంలో మునిగిపోయి శిథిలావస్థకు చేరుకుంది.గుట్టమీదపల్లి,ఇప్పుడు నిర్మానుష్యంగా మారింది.గ్రామ పరిస్థితిని ఒక్కసారి చూస్తే కన్నీళ్లు ఆగవని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి,గ్రామాల వలసలను అరికట్టేలా సౌకర్యాలు కల్పించాలని ప్రజలు కోరుతున్నారు.

