గాంధీ నగర్: గుజరాత్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరుగుతోన్న ఐపీఎల్ 19 ఫైనల్లో ఆర్సీబీ బౌలర్లు సత్తా చాటుతున్నారు. గుజరాత్ బ్యాటర్లను వారి సొంత గడ్డపై కట్టడి చేస్తున్నారు. ఆర్సీబీ బౌలర్లు చెలరేగడంతో గుజరాత్ తొలి 10 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 63 పరుగులు మోస్తారు.
సూపర్ ఫామ్‌లో ఉన్న జీటీ ఓపెనర్లు సాయి సుదర్శన్ (12), కెప్టెన్ గిల్ (10) కీలకమైన ఫైనల్ పోరులో చేతులెత్తేశారు. యువ బ్యాటర్ నిశాంత్ సింధు (20) కాసేపు ప్రతిఘటించాడు. ఆర్సీబీ బౌలర్లలో భువనేశ్వర్, హేజిల్ వుడ్, రసిఖ్ సలాందార్ తలో వికెట్ తీశారు. ప్రస్తుతం బట్లర్ (14), వాషింగ్టన్ సుందర్ (7) క్రీజులో ఉన్నారు. ఆర్సీబీ బౌలర్లు చివరి వరకు ఇదే జోరు కొనసాగిస్తే గిల్ సేన తక్కువ స్కోర్‌కే పరిమితమయ్యే అవకాశం ఉంది.
►ఇంకా చదవండి |టాస్ గెలిచిన ఆర్సీబీ.. గిల్ సేనకు బ్యాటింగ్ అప్పగించిన పాటిదార్.. ఇరు జట్లలో మార్పులు ఇవే!
(ఫంక్షన్(i,s,o,g,r,a,m){i(“GoogleAnalyticsObject”)=r;i(r)=i(r)||ఫంక్షన్(){ (i(r).q=i(r).q||()).push(arguments)},i(r).l=1*new Date();a=s.create m=s.getElementsByTagName(o)(0);a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m)})(window,document,”script”,”https://www.google-analytics.com/analytics.js”,”ga); ga(“సృష్టించు”, “UA-133664641-1”, “ఆటో”); ga(“అవసరం”, “ప్రదర్శన ఫీచర్లు”); ga(“సెట్”, “క్యాంపెయిన్సోర్స్”,”ఫేస్బుక్”); ga(“సెట్”, “క్యాంపెయిన్ మీడియం”, “సోషల్ ఇన్స్టంట్ ఆర్టికల్”); ga(“set”, “title”, “గుజరాత్ గడ్డపై గర్జిస్తోన్న RCB బౌలర్స్.. తొలి 10 ఓవర్లలో GT స్కోర్ ఎంతంటే..?”); ga(“పంపు”, “పేజీ వీక్షణ”);

