నైరుతి రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్ ను టచ్ చేశాయి. వాతావరణ శాఖ అధికారులు అంచనా ప్రకారం మరో రెండు రోజులు నైరుతి రుతుపవనాలు ప్రవేశించేందుకు అంచనా వేశారు. కానీ నేడు నైరుతి రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్ ను తాకినట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
రాయలసీమలో…
రాయలసీమలో రుతుపవనాలు ప్రవేశించాయి. కేరళ, కర్ణాటక నుంచి రాయలసీమకు నైరుతి రుతుపవనాలు వచ్చాయి. దక్షిణ కోస్తాలో రుతుపవనాలు విస్తరిస్తున్నాయి. మరో పదిహేను రోజుల్లో ఏపీ అంతటా రుతుపవనాలు విస్తరిస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మూడు నుంచి ఎండలతో మాడిపోతున్న ప్రజలకు ఉపశమనం లభించినట్లయింది.

