google pixel 11 : స్మార్ట్ ఫోన్ కొనాలని చూసేవారికి గూగుల్ కంపెనీ లేటెస్ట్ గా సూపర్ న్యూస్ తెచ్చింది. ఈ కంపెనీకి చెందిన ప్లాగ్ ఫిష్ కొత్త ఫోన్ ను తీసుకురాబోతుంది. ఇందులో భాగంగా న్యూయార్క్‌లో వచ్చే నెలలో జరగనున్న ‘మేడ్ బై గూగుల్’ అనే ప్రోగ్రాంలో ఏకంగా 4 ప్రీమియం ఫోన్లను పరిచయం చేయనుంది. ఇవి ఎలా ఉండబోతున్నాయో తెలుసుకోవాలని చాలా మందికి ఆసక్తి కలిగింది. ఈ నేపథ్యంలో ఈ ఫోన్ల గురించి అంచనాలు ఎలా ఉన్నాయో చూద్దాం..
గూగుల్ పిక్సెల్ 11సిరీస్‌లో భాగంగా 4 ఫోన్లు రాబోతున్నాయి వీటిలో గూగుల్ పిక్సెల్ 11, పిక్సెల్ ప్రో, పిక్సెల్ 11 ప్రోతో పాటు పిక్సెల్ 11 ఫ్రో ఫోల్డ్ అనే మోడల్స్ ఉన్నాయి. ఈ ఫోన్లన్నీ దాదాపు ఒకే ఫీచర్ ను కలిగి ఉండే అవకాశం ఉందని అంటున్నారు. డిజైన్ విషయంలో వీలో కొత్తగా పిక్సెల్ గ్లో పేరుతో కొత్తగా ఎల్ ఈ డీ లైటింగ్ సిస్టమ్‌ను పరిచయం చేయబోతున్నారు. అలాగే ఇందులో జెమినీ ఏఐ, ఛార్జీంగ్ స్టేటస్, అలారం కోసం కెమెరా వద్ద నోటిఫికేషన్ వచ్చే విధంగా లైటింగ్ ను ఏర్పాటు చేశారు. ఈ ఫోన్లలో బేస్ మోడల్ 6.3, చివరి మోడల్ 6.8 OLED డిస్క్ ప్లేను కలిగి ఉంది.
పర్ఫామెన్స్ విషయంలో గూగుల్ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లు. ఎందుకంటే వీటిలో టీఎస్ ఐకాయ్ 2 ఎన్ఎం ప్రాసెస్ పై తయారైన టెన్సర్ జీ 6 చిప్ సెట్ ను వాడతారు. ఇది ఇంతకు ముందు ఉన్న ఫోన్ల కంటే మెరుగ్గా పనిచేస్తుందన ిఅంటున్నారు. అలాగే ఇందులో నెట్ వర్క్ కనెక్టివిటీ, స్పీడ్, శాటిలైట్ సపోర్ట్ కోసం మీడియా టెక్ ఎం90 మోడెమ్ ను వినియోగించుకునే సమాచారం. ఆండ్రాయిడ్ 17 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఇందులో కెమెరా ఉన్నాయి.
పిక్సెల్ మొదటి వేరియెంట్ ఫోన్ లో 50 మెగా పిక్సెల్ తో కూడిన మెయిన్ కెమెరా ఉండనుంది. అలాగే ప్రో మోడల్లో నూ 50 ఎంపీ మెయిన్ కెమెరాతో పాటు 50 ఎంపీ అల్ట్రా వైడ్ లెన్స్ ఉన్నాయి. వీటితో పాటు 48 ఎంపీ టెలిఫోటో కెమెరా సెటప్ ఉండనుంది. ఈ కెమెరాతో తీసిన జెమినీ ఏఐ సహాయంతో ఫోటో ఎడిటింగ్ చేసుకోవచ్చు. ఆడియో మ్యూజిక్ ఎరేజర్, నైట్ విజన్ వంటి ఫీచర్లు ఆకట్టుకోనున్నాయి.
వేరియంట్, ఫీచర్లను భట్టి వీటి ధరలు కూడా ఆకర్షణీయంగానే ఉన్నాయి. గూగుల్ పిక్సెల్ ధర 899 డాలర్లు (భారత్ లో రూ.84,999) గా నిర్ణయించినట్లు సూచించబడింది. పిక్సెల్ ప్రో రూ.1,03,999 గా ఉంది. అలాగే పిక్సెల్ ప్రో ఎక్స్ ఎల్ రూ.1,19,999 తో విక్రయించబడుతుంది. ఈ ఫోన్లు ఆగస్టు చివరి వారంలో మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

