గోదావరి పుష్కరాలకు ముహూర్తం ఖరారైంది. 2027లో గోదావరి పుష్కరాలు జరగనున్నాయి. వచ్చే ఏడాది జూన్ 26వ తేదీ నుంచి జులై 7వ తేదీ వరకూ గోదావరి పుష్కరాలు జరగనున్నాయి. పన్నెండు రోజుల పాటు జరిగే ఈ పుష్కరాలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. స్నానం చేయడానికి ఘాట్లు, నిర్మాణంతో పాటు అభివృద్ధి పనులు చేస్తున్నారు.
జూన్ 26వ తేదీన…
తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో ముఖ్యమంత్రి చంద్రబాబు గోదావరి పుష్కరాలను ప్రారంభించనున్నారు. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి పరిధిలో వందల సంఖ్యలో ఘాట్లను సిద్ధం చేశారు. కుంభమేళా తరహాలో ఈ గోదావరి పుష్కరాలను నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. గోదావరి పుష్కరాల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రత్యేకంగా నిధులు కేటాయించారు.

