Gopichand Bharata Varsha Budget: ఒకప్పుడు యాక్షన్ హీరో గా మాస్ ఆడియన్స్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరో గా గోపీచంద్ కి ఉన్న పేరు ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. లక్ష్యం మూవీ టైం లో ఈయన సినిమాలకు వచ్చే ఓపెనింగ్ వసూళ్లు స్టార్ హీరోల సినిమాలకు సమానంగా ఉండేవి. విలన్ గా పాపులర్ అయ్యి , ఆ తర్వాత హీరో గా మారి ఈ రేంజ్ కి ఎదగడం అనేది సాధారణమైన విషయం కాదు. కానీ మధ్యలో వచ్చిన కొన్ని ఫ్లాపులు, జనరేషన్ కి తగ్గట్టుగా తనని తానూ మార్చుకోవడం వల్ల మార్కెట్ ని కోల్పోవాల్సి వచ్చింది. స్టార్ హీరో స్థాయి నుండి కనీస స్థాయి మార్కెట్ లేని హీరో స్థాయికి పడిపోవాల్సి వచ్చింది. ఇది ఆయన అభిమానులను తీవ్రమైన నిరాశకు గురి చేసే విషయం.
అయితే సరైన సినిమా పడితే గోపీచంద్ కం భారీ బ్యాక్ రేంజ్ లో ఇస్తాడని ఇప్పటికీ నిర్మాతలు బలంగా నమ్ముతున్నారు. అందుకే ఆయన్ని హీరో గా పెట్టి ఇప్పటికీ సినిమాలు చేస్తూనే ఉన్నారు. ప్రస్తుతం ఆయన ‘భరత వర్ష’ అనే చిత్రం చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషనల్ కంటెంట్ బయటకి రాగా, ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. సినిమా చాలా రిచ్ గా ఉంది , గోపీచంద్ రేంజ్ కి తగ్గ సినిమా లాగా అనిపిస్తోంది , కచ్చితంగా ఈ సినిమాతో ఆయన బ్యాక్ ఇస్తాడని అంతా అనుకున్నారు. అయితే ముందుగా ఈ నిర్మాతలు కేవలం 30 కోట్ల రూపాయల బడ్జెట్తో నిర్మించాలని అనుకున్నారు. గోపీచంద్ కి అంత మార్కెట్ లేదు , ఆయన మార్కెట్ కి అది మూడింతలు ఎక్కువ, అయితే రిస్క్ చేశారు నిర్మాతలు.
అయితే ఈ సినిమా షూటింగ్ పూర్తి అయ్యే సమయానికి ఆ బడ్జెట్ కాస్త 70 కోట్ల రూపాయలకు చేరిందని అంటున్నారు. అంటే అనుకున్న దానికంటే రెండింతలు ఎక్కువ బడ్జెట్ అయ్యింది అన్నమాట. ఇంత బడ్జెట్ అయినా నిర్మాతలో ఎలాంటి భయం లేదట. ఎందుకంటే సినిమా ఔట్పుట్ చాలా అద్భుతంగా వచ్చిందని , మరో 20 కోట్లు కూడా ఖర్చు పెట్టడానికి నిర్మాత సిద్ధంగా ఉన్నాడని అంటున్నారు. మరి గోపీచంద్ డ్రీం ప్రాజెక్ట్ ఎంత వరకు సక్సెస్ అవుతుంది?, ఈ ఏడాది కం బ్యాక్ సినిమాలు ఎక్కువగా ఉన్నాయి , కరుప్పు తో సూర్య , పెద్ది తో రామ్ చరణ్ దిమ్మ తిరిగే రేంజ్ కం బ్యాక్స్ ఇచ్చారు , గోపీచంద్ కూడా అదే రేంజ్ కం బ్యాక్ ఇస్తాడో చూడాలి.

