గోల్కొండ జగదాంబిక మహంకాళి అమ్మవారి దర్శనం కోసం గోల్కొండకు పోటెత్తారు భక్తులు. ఆదివారం (జులై 19) భక్తుల రద్దీ పెరగడంతో పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. వేలాదిగా తరలివచ్చిన భక్తులతో గోల్కొండ కోట పరిసర ప్రాంతాలు కిటకిటలాడాయి. గోల్కొండ కోట చుట్టూ ఎటు చూసినా అమ్మవారికి తీసుకొచ్చిన బోనాలు, గటాల ఊరేగింపు, పోతరాజు విన్యాసాలతో కోలాహల వాతావరణం..
హైదరాబాద్ సిటీ పోలీస్ ఆధ్వర్యంలో లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ భద్రతకు సంబంధించి రెండు వేల మంది పోలీసులతో భద్రత కల్పించారు. భక్తులకు ఎక్కడ ఇబ్బందులు తలెత్తకుండా సౌకర్యాలు కల్పించారు అధికారులు. మహిళల భద్రత కోసం షీ టీమ్స్ తో పాటు మస్తీ టీమ్స్ ను రంగంలోకి దింపి భద్రత కల్పించారు.
అమ్మవారిని దర్శించుకున్నందుకు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ట్రాఫిక్ డైవర్షన్స్ రూట్ మ్యాప్ ను అందుబాటులో ఉంచారు పోలీసులు. అమ్మవారికి బోనాలు, ఘటాలు తీసుకొస్తున్న భక్తులు వర్షంలోనూ తడుస్తూ ఆనందంగా నృత్యాలు చేస్తూ బోనాలు అమ్మవారికి సమర్పించారు. సాయంత్రం 8 గంటల వరకు కొనసాగింది.

