– ప్రకటన –
నవతెలంగాణ-జక్రాన్ పల్లి
చింతలూరులో జరిగిన గ్రామ సర్పంచ్ నాగుల శ్రీనివాస్ అధ్యక్షతన గ్రామసభ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎలినినో ప్రభావం గురించి, ప్లాస్టిక్ నిషేధం గురించి వివరించారు. ఈ గ్రామ ప్రజల మేలు కోసం 500 స్టీల్ ప్లేట్లు విరాళంగా అందజేస్తానని ఆయన ప్రకటించారు. అనంతరం ఎస్సై మహేష్ మాట్లాడుతూ సైబర్, డ్రగ్స్ వాహనదారుల భద్రత గురించి అవగాహన కల్పించారు. అనంతరం జాతీయ కుటుంబ ప్రయోజన పథకంలో భాగంగా రూ.20,000/- చొప్పున నలుగురు లబ్దిదారులకు ప్రోసిడింగ్ కాపీలు జారీ. ఈ కార్యక్రమంలో ఎస్సై మహేష్, మండల అధికారి ప్రవీణ్, ఎంపీవో రాజేష్, ఉపసర్పంచ్ బాలకృష్ణ వార్డు సభ్యులు గ్రామస్థాయి అధికారులు, మహిళలు వీడీసీ సభ్యులు గ్రామప్రజలు ఉన్నారు.
– ప్రకటన –

