విశాలాంధ్ర –కడబూరు (కర్నూలు) : గ్రామ సమస్యలను పంచాయతీ కార్యదర్శి దస్తగిరిపై చర్యలు తీసుకోవాలని సోమవారం సీపీఐ ఆధ్వర్యంలో ఎంపీడీఓ ప్రభావతి దేవికి వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా సీపీఐ మండల కార్యదర్శి వీరేష్, కమిటీ సభ్యులు రాజు మాట్లాడుతూ మండల పరిధిలోని నాగలాపురం గ్రామంలో లాయర్ అని చెప్పుకునే హనుమయ్య ఇంటి ముందు ఉన్న రోడ్డుపై అక్రమ కట్టడాలు కడుతున్నాడని తెలిపారు. తిమ్మారెడ్డి ఇంటి ముందు ఉన్న రోడ్డుపై హనుమయ్య రాజకీయ నాయకుల అండదండలతో రోడ్డుపై పశువులు కట్టేస్తూ ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు. అలాగే ఎక్కడైతే పేదల ఇళ్ల నిర్మాణం జరుగుతుందో అక్కడికి డబ్బులు ఇస్తే ఒక న్యాయం, ఇవ్వకపోతే ఒక న్యాయం చేస్తారన్నారు. ఈ విషయం పంచాయతీ కార్యదర్శి చెబితే కుంటి సాకులు చెపుతూ హనుమయ్యకు వత్తాసు పలుకుతున్నాడని తెలిపారు. వీరిద్దరూ కలిసి గ్రామంలో ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. వీరిపై కావున అధికారులు స్పందించి చర్యలు లేనిపక్షంలో సీపీఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ మండల కార్యదర్శి వీరేష్, నాయకులు తిమ్మారెడ్డి, లక్ష్మన్న, మల్లేష్ ఉన్నారు.

