విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని కళాజ్యోతిలో (ఈ సి ఆర్ ఆర్ సరస్వతి నిలయం) కళాజ్యోతి కార్యవర్గం ఆధ్వర్యంలో అన్నమయ్య సంకీర్తన విభావరి కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించడం పట్ల కళాజ్యోతి కార్యవర్గం అధ్యక్షులు కె నారాయణ, కార్యదర్శి బి రామకృష్ణ, ఉపాధ్యక్షులు జగ్గా వేణుగోపాల్ పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం వారి అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులచే ఈ సంకీర్తన విభావరి నిర్వహించామని తెలిపారు. అనంతరం తిరుమల తిరుపతి దేవస్థానం ప్రాజెక్ట్ కళాకారులు ఆలపించిన సంకీర్తన గానము అందరినీ ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు ఉన్నారు.

