విశాలాంధ్ర బ్యూరో ` కర్నూలు :భారత మహిళా సమాఖ్య 72వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు సీఆర్ భవన్లో ఘనంగా జరిగాయి. గురువారం ఏపీ మహిళా సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి పి శ్రావణి రెడ్డి అధ్యక్షతన జెండా ఆవిష్కరణ జరిగింది. ముందుగా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు మాజీ కార్పొరేటర్ ఎస్ గిడ్డమ్మ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ1954లో భారత జాతీయ మహిళా సమాఖ్య కలకత్తాలో ఏర్పాటు చేయడం జరిగింది. మహిళా సమాఖ్య ఏర్పాటులో ప్రముఖంగా హజారా బేగం, అరుణ ,ఆశఫ్ అలీ ,అనసూయ ,జ్ఞాన్ చంద్ ,పుష్పమయి ,బోస్ ,రేణు చక్రవర్తి ,విమల ,ఫరుకి ,గీతా ముఖర్జీ ,ప్రమీల లు ముంబులతో తారారెడ్డి ,గుజ్జుల సరళ దేవిల నాయకత్వంలో భారత జాతీయ మహిళా పోసుమాఖ్య. నాటి నుండి నేటి వరకు మహిళా పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తూ సమస్యలకు దారి తీస్తుంది. దేశంలోని మహిళలకు చట్టసభలలో 33 శాతం రిజర్వేషన్ మహిళలకు అందించిన ఆనాటి ఉత్తమ పార్లమెంటరీ కామ్రేడ్ గీతా ముఖర్జీ నాయకత్వంలో పార్లమెంటులో గళం విప్పి పోరాటం చేసింది.ఈ దేశంలో నీ మహిళలకు స్వేచ్ఛ సమానత్వం, స్వాతంత్ర్యం కోసం నేటిదాకా పోరాటం చేస్తున్న మహిళా సమాఖ్య మాత్రమే నన్నారు. నరేంద్ర మోడీ బేటి బచావో, బేటి పడావో అన్న నినాదంతో పరిపాలన చేస్తున్నాడే గాని మణిపూర్ లాంటి రాష్ట్రాలలో మహిళలపై అత్యాచారాలు , హత్యలు జరుగుతున్నాయని కళ్ళు కాయలు కాచేలా మారాడని. దేశ ప్రధాని బేటి పడావో బేటి బచావో అన్న నినాదం మరి ఎక్కడ నెరవేరిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు .ఈ దేశంలో ఈ రాష్ట్రంలోని మహిళల కోసం మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై రాజీ లేని పోరాటం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకురాలు కోటమ్మ. రేణు¿.£ ఆశా బేగం .సోఫియా .నగర నాయకురాలు పావని .వెంకటేశ్వరమ్మ .మునెమ్మ .స్వప్న. మాధవి .యశోద మహిళలు పెద్ద ఎత్తున ఉన్నారు.

