ఎల్ఐసి పరిరక్షణే ధ్యేయం..రక్షణే ధ్యేయం..
విశాలాంధ్ర ధర్మవరం; పట్టణంలోని ఎల్ఐసి భీమా రంగ ఉద్యోగుల సంఘం 76వ ఆవిర్భావ వేడుకలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఎల్ఐసి అధికారులు మాట్లాడుతూ ప్రభుత్వ రంగ భీమా రంగాన్ని బలహీనపరిచే ఎఫ్డిఐ పెంపుదల, ఐపీఓ ల వంటి విధానాలను నిరసిస్తూ ప్రజల ఆస్తి అయిన ఎల్ఐసిని కాపాడుకోవడమే ఈ ఆవిర్భావ దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ప్రతి ఇన్సూరెన్స్ ఉద్యోగి ప్రతిజ్ఞ అని చెప్పారు. వేతన సవరణ మరియు పెన్షన్: ఇన్సూరెన్స్ ఉద్యోగుల వేతన సవరణ ఒప్పందాలను విజయవంతంగా సాధించడంలో, అలాగే పాత పెన్షన్ స్కీమ్ ప్రయోజనాలకు ఉద్యోగులకు అందించడంలో ఈ సంఘం కీలక పాత్ర పోషించింది.
మహిళా ఉద్యోగుల ఏ ఐ ఐ ఈ ఏ లో మహిళా ఉద్యోగుల భాగస్వామ్యం చాలా ఎక్కువ (సుమారు 40 శాతము పైగా). యూనియన్ నాయకత్వంలో కూడా మహిళలకు ప్రాధాన్యత కల్పించబడుతోంది.
ఐక్యత – లౌకికవాదం: దేశంలో మతోన్మాదానికి వ్యతిరేకంగా, లౌకికవాదాన్ని ,రాజ్యాంగ విలువలను కాపాడటంలో ఈ సంఘం ఎల్లప్పుడూ ముందుంటుంది. కశ్మీర్, అసోం వంటి ప్రాంతాల సంక్షోభ సమయాల్లో దేశ సమగ్రత కోసం గుర్తించామని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎల్ఐసి అధికారులు అధిక సంఖ్యలో ఉన్నారు

