బెంగళూరు : చంద్రుడి దక్షిణ ధృవం అనుకూలమైన మంచు పొరలు దాగి ఉన్నాయని ఇస్రో చంద్రయాన్ 2 పరిశోధనలలో వెల్లడైంది. చంద్ర మండలానికి సంబంధించి ఇది అత్యంత వినూత్న ఆవిష్కరణ. భారతదేశపు చంద్రయాన్ 2 పూర్తి స్థాయిలో విజయం సాధించలేదు. అయితే ఈ ప్రయోగంలో అక్కడున్న ఆర్బిటార్ ద్వారా సంకేతాలు వెలువడుతున్నాయి. వీటిని ఇస్రో కేంద్రం క్రోడీకరించుకుంది.
ఈ అక్కడ ఆపారరీతిలో ఐస్ దాగి ఉందని నిర్థారణ అయింది. దీనితో చంద్ర మండలంపై మానవుడి దీర్ఘకాలిక ఉనికి అవకాశాలు అయినట్లు గుర్తించారు. చంద్రుడి దక్షిణ ధృవంలో అపార రహస్యాలను ఛేదించేందుకు చంద్రయాన్ 2ను తలపెట్టారు. ఆర్బిటార్కు అమర్చి ఉన్న రెండంచెల పనితీరు రాడార్ సాయంతో చంద్రుడి అడుగున ఉన్న మంచు నిల్వలను కనుగొన్నారు. మంచులో ఉంటే జలవనరులతో మనిషి మనుగడకు వీలుంటుందని సూచన.

