విశాలాంధ్ర – సోమందేపల్లి: మండల పరిధిలోని చాలకూరు సమీపంలో బుధవారం రాత్రి రైల్వే గేట్ గ్రామమెన్ ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన.పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రొద్దం మండలం కళ్లకుంట గ్రామానికి చెందిన సూర్యప్రకాశ్ (41) చాలకూరు రైల్వే గేటు వద్ద గేట్మెంగా విధులు నిర్వహిస్తున్నాడు. బుధవారం రాత్రి విధుల్లో ఉన్న సమయంలో రైల్వే గేటు మూసివేసిన అనంతరం చింతచెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.మృతుడి భార్య. వివాహమై ఏడేళ్లు గడిచినా సంతానం కలగకపోవడం, కుటుంబ సమస్యలు, అధిక అప్పుల భారంతో మనస్తాపానికి గురై ఈ ఘాతుకానికి పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైందని ఎస్ఐ సుధాకర్ యాదవ్ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ పెనుకొండ ఆసుపత్రికి తరలించినట్లు ఎస్ఐ తెలిపారు.

