Chiranjeevi Bobby Movie: మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘వాల్తేరు వీరయ్య’ సినిమా సూపర్ సక్సెస్ అయింది. ఒక రకంగా చిరంజీవికి సెకండ్ ఇన్నింగ్స్‌లో భారీ సక్సెస్‌గా చెప్పుకునే సినిమాల్లో ‘వాల్తేరు వీరయ్య’ సినిమా కూడా ఒక విశేషం… ఇక ఇది ఇలా ఉంటే ప్రస్తుతం వీళ్ళిద్దరి కాంబినేషన్లో మరో సినిమా తెరకెక్కుతుంది. చిరంజీవిని ఎలా చూపిస్తే ప్రేక్షకులు యాక్సెప్ట్ చేస్తారనే విషయం బాబీ కి బాగా తెలిసినట్టుంది. అందుకే అలాంటి కథలతోనే చిరంజీవి దగ్గరికి వెళ్లి అతన్ని మెప్పించి మరి సినిమాలను చేశాడు. ఇక ఏది ఏమైనా కూడా బాబీ ఈ మధ్యకాలంలో చేసిన సినిమాలతో మంచి విజయాలను సాధిస్తున్నాడు…
గత సంవత్సరం సంక్రాంతి కానుకగా వచ్చిన ‘డాకు మహారాజ్’ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. బాబీ లాంటి దర్శకుడు కమర్షియల్ సినిమాలను చేస్తూ ప్రేక్షకులకు వినోదాన్ని అందించాడు. మరలాంటి దర్శకుడు చిరంజీవిని ఇప్పుడు ఎలా చూపించబోతున్నాడు. డిఫరెంట్ కోణంలో చూపిస్తాడా? లేదంటే రొటీన్ గానే చూపించి బోర్ కొట్టిస్తాడా అనేది కూడా తెలియాల్సి ఉంది.
ఇక ఏది ఏమైనా కూడా చిరంజీవి కూడా ఈ సినిమాలో చాలా వరకు ఇన్వాల్వ్ అవుతున్నాడు. కాబట్టి తను కథ విషయంలో చాలా స్ట్రాంగ్ గా ఉన్నట్లు తెలుస్తుంది. మరి ఈ కథని ఏ రేంజ్ లో తెరకెక్కిస్తున్నారు. మొత్తానికైతే బాబీ చిరంజీవితో మరో సక్సెస్ ని సాధించడం పక్కానా అంటూ మరికొంతమంది కామెంట్లు చేస్తున్నారు. ఇక చిరంజీవి తనకు ఎవరైతే సక్సెస్ లను అందిస్తారో వాళ్లకి మాత్రమే సినిమాలు ఇచ్చేవాడు.
నిజానికి చిరంజీవి తో సినిమా కోసం చాలామంది దర్శకులు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కానీ వాళ్లెవరికి అవకాశం ఇవ్వడం లేదు. కారణం ఆయన చెప్పినట్టుగా సినిమా చేస్తూ కమర్షియల్ హంగులతో ప్రేక్షకులను టైన్ చేయగలిగే దర్శకులను మాత్రమే ఆయన నమ్ముతున్నాడు. కాబట్టి బాబీకే ఆయన ఎక్కువగా అవకాశాలు ఇస్తున్నాడు…

