– ప్రకటన –
చైర్మన్ వెంకటయ్య
నవతెలంగాణ-మిడ్జిల్
ఎల్నినో ప్రభావం వలన వర్షాలు పడవని శాస్త్రవేత్తలు సూచనలతో రైతులు చిరుధాన్యాలు పండించి అధిక లాభాలు పొందాలని దండిబి ఫార్మా చైర్మన్ పరిమటి వెంకటయ్య చెప్పారు. కొత్తూరు గ్రామంలో రైతులకు చిరుధాన్యాల సాగుపై అవగాహన ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వ్యవసాయ అధికారులు పాల్గొని మాట్లాడారు.
చిరుధాన్యాల సాగు ప్రస్తుతం ఎల్నినో ప్రభావం వల్ల వర్షపాతం అనుకూలంగా ఉండకపోవడం, నీటి కొరత వంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో తక్కువ నీటితో, ఖర్చుతో మంచి దిగుబడి ఇచ్చే పంటలు సజ్జలు, కొర్రలు, సామలు, అరికెలు, ఊదలు,కందాలు, మినుములు సాగు చేసుకోవాలని సూచించారు.
తక్కువ నీటితో సాగు చేసుకోనివ్వండి. వాతావరణ మార్పులకు అనుకూలంగా ఉంటాయి. పోషక విలువలు అధికంగా ఉన్న రైతులకు మంచి లాభాలు అందజేస్తాయని సూచించారు. నేల ఆరోగ్యాన్ని అందించడంలో కూడా సహాయపడుతుంది, అందువల్ల ఎల్నినో వంటి వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, మన రైతులు చిరుధాన్యాల సాగును ప్రోత్సహించి, స్థిరమైన ఆదాయాన్ని మరియు ఆహార భద్రతను సాధిద్దాము.
తక్కువ నీరు , ఎక్కువ పోషణ స్థిరమైన ఆదాయం చిరుధాన్యాల సాగుతో రైతు భవిష్యత్తు బంగారం అని రైతులకు సూచించారు . ఈ కార్యక్రమములో గ్రామ సర్పంచ్ కావాలి రాములు, ఉపసర్పంచ్ అర్జున్ , దుందుభి ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్, సీఈఓ నరేష్, డైరెక్టర్ పి దశరథం, అభిలాష్ రెడ్డి, కుమార్ జి మల్లేష్, గంగాధర్, శివకుమార్,రామాంజనేయులు, తిరుపతయ్య, జంగయ్య, తిరుపతిరెడ్డి గ్రామ రైతులు ఉన్నారు.
– ప్రకటన –

