Indian Culture: పోలీసులు అంటే మనుషులే కదా.. నేరస్తులను పట్టుకోవటమే కాదు.. చాలా సందర్భాల్లో తమ మానవత్వాన్ని.. సాయాన్ని చూపించినోళ్లు ఎంత మందో.. ఆగ్రాలోని తాజ్ మహల్ ఉంది కదా.. అక్కడ సెక్యూరిటీ గార్డ్ ఉన్న ఓ లేడీ కానిస్టేబుల్ ఇప్పుడు అర్జంటుగా దేశంలోనూ ఫేమస్ అయ్యారు.. ఆమె చేసిన సాయం చేసింది.. ఆ లేడీ కానిస్టేబుల్ ను సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఇంతకీ ఆ స్మార్ట్ కథ ఏంటో తెలుసుకుందామా..
చీర కట్టుకునేందుకు ఇబ్బంది పడిన టూరిస్ట్:
అర్జెంటీనా దేశం నుంచి కొందరు పర్యాటకులు ఇండియా వచ్చారు. తాజ్ మహల్ చూడాలనే కోరికతో.. 2026, జూలై 13వ తేదీన అక్కడికి చేరుకున్నారు. వీరిలో ఓ యువతి భారతీయ సంప్రదాయ దుస్తులు అయిన చీర కట్టుకోవాలని నిర్ణయించుకున్నది. చీర కొనుగోలు చేసి కట్టుకుని.. తాజ్ మహల్ వచ్చారు. చీర కట్టుపై అవగాహన లేక.. తాజ్ మహల్ దగ్గర చాలా ఇబ్బంది పడుతూ కనిపించింది ఆ పర్యాటకురాలు. తాజ్ మహల్ వెస్ట్ ఎంట్రీ ఉన్న భద్రతా పర్యవేక్షణలో గుడ్డిదేవి అనే మహిళా కానిస్టేబుల్ అన్నారు. అర్జెంటీనా పర్యాటకులు.. చీర కట్టులో పడుతున్న ఇబ్బంది.. నడుస్తున్న విధానం చూసి సాయం చేయాలని భావించారు.
చీర కుచ్చిళ్లను సరిచేసిన కానిస్టేబుల్:
అర్జెంటీనా పర్యాటకుల దగ్గరకున కానిస్టేబుల్ గుడ్డి దేవి.. మీకు ఏమైనా సాయం కావాలా అని అడిగారు.. కానిస్టేబుల్ నేరుగా వచ్చి అడగడంతో మొహమాట పడిన ఆ విదేశీ పర్యాటకురాలు.. చీర కట్టులో ఉన్న ఇబ్బందిని చెప్పుకొచ్చారు. అదే విషయంపై మాట్లాడాలని వచ్చాను.. నేను మీకు సాయం చేయగలను అని ముందుకు వచ్చారు. అందుకు ఆ విదేశీ టూరిస్ట్ ఓకే అనడంతో.. తాజ్ మహల్ సెక్యూరిటీ గార్డ్ గది దగ్గరకు తీసుకెళ్లి.. చీర కట్టును సరిచేశారు. చీర కుచ్చిళ్లను సరిచేశారు. ఆమెకు చీర కట్టారు కానిస్టేబుల్ గుడ్డిదేవి..
కానిస్టేబుల్ తో ఫోటో దిగిన అర్జెంటీనా టూరిస్ట్:
దీనికి ఫిదా అయిన అర్జెంటీనా టూరిస్ట్.. కానిస్టేబుల్ తో దిగిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది. ధన్యవాదాలు యూపీ పోలీస్ అని కామెంట్ చేసింది. సాధారణ పోలీస్ విధులకు మించి.. ఓ పర్యాటక ప్రదేశంలో పర్యాటకుల ఇబ్బందులను గమనించి సాయం చేయటం అనేది మంచి భావన అని.. పోలీసులలో ఇలాంటి, సమయస్ఫూర్తి అవసరం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
వసుదైక కుటుంబం అనటానికి ఇదే నిదర్శనం:
భారతదేశం అతిథిదేవో భవ.. వసుదైక కుటుంబం అనటానికి ఇదే నిదర్శనం అని.. భారతదేశం వచ్చిన వారిని ఎంత బాగా చూసుకుంటామో మహిళా కానిస్టేబుల్ గుడ్డిదేవి నిదర్శనం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఏదిఏమైనా భద్రతా పర్యవేక్షణలో ఉన్న ఓ లేడీ కానిస్టేబుల్ నిశిత పరిశీలనకు హ్యాట్సాప్ చేయాలని అంటున్నారు మరికొందరు నెటిజన్లు..

