తమ సినిమా పెద్ద హిట్ అవుతుందని, బ్లాక్ బస్టర్ అవుతుందని మేకర్స్ చెప్పడం మామూలే. ఇలా ఎవరైనా చెప్పుకుంటే అదేమీ ఆశ్చర్యంగా అనిపించదు. కానీ తమ సినిమా క్లాసిక్ అవుతుందని ఎవరైనా అంటే కొంచెం ఆశ్చర్యంగా చూస్తాం. ఐతే ఇప్పుడో చిత్ర బృందం తమ సినిమా ‘కల్ట్ క్లాసిక్’ అని ప్రకటించుకోవడమే కాదు.. పోస్టర్ల మీద, వీడియో ప్రోమోల్లో స్టాంప్ కూడా వేస్తోంది. బహుశా ఫిలిం ఇండస్ట్రీలో ఇంతకుముందెన్నడూ చూడని చిత్రమిది.
వచ్చే శుక్రవారం విడుదల కానున్న ‘చెన్నై లవ్ స్టోరీ’ టీం చేస్తున్న సాహసమిది. ఏ సినిమా అయినా విడుదల తర్వాత, కాల కావాల్సిన కల్ట్, క్లాసిక్ స్టేటస్ తెచ్చుకుంటుంది. కానీ రిలీజ్కు ముందే ‘కల్ట్ క్లాసిక్’ అని చెప్పుకోవడం వింటే. నిర్మాత అల్లు అరవింద్ కూడా ఈ విషయంలో ఒకింత ఆశ్చర్యం వ్యక్తం చేసారు, ఈ సినిమాకు అర్హత ఉందనిపిస్తోందని.
‘బేబీ’ సినిమా మేకర్సే ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా తీశారు. ‘బేబీ’కి పెయిడ్ ప్రిమియర్స్ అయిపోయాక దాన్ని కల్ట్ మూవీ అని ప్రచారం చేయడం విజయవంతం అయింది. ఆ మాటతో ఏకీభవించిన వాళ్లున్నారు. అలాగే ‘బేబీ’ కమర్షియల్ హిట్ మాత్రమే.. అది కల్ట్ ఏంటి అన్నవాళ్లూ లేకపోలేదు. కానీ ఇప్పుడు రిలీజ్కు ముందే ‘చెన్నై లవ్ స్టోరీ’ని కల్ట్ క్లాసిక్ అని బల్లగుద్ది చెబుతూ, ప్రోమోల్లో ఆ మాట వాడుతుండడం కొంచెం ఎక్కువగా అనిపిస్తోంది.
ఇది చాలా రిస్క్ అనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది.
ఇలా ప్రచారం చేసుకున్నాక సినిమా ప్రేక్షకులు చూస్తే కోణమే మారిపోతుంది. కథ అంత గొప్పగా ఉండాలని ఆశిస్తారు. ప్రతి సన్నివేశంలోనూ క్లాసిక్ ఫీల్ కోరుకుంటారు. అంచనాలు అమాంతం పెరిగిపోతాయి.
ఈ హైప్ వల్ల ఓపెనింగ్స్ రావచ్చేమో కానీ.. సినిమా ఏమాత్రం తగ్గినా అది నెగెటివ్ అవుతుంది. దీన్నా కల్ట్ అన్నారు, క్లాసిక్ అన్నారు అంటూ వెటకారాలడతారు. టాక్ తేడా కొడుతుంది. మరి ఈ ముప్పు ఉంటుందని తెలిస్తే ఇలా ప్రచారం చేస్తున్నారు అంటే.. సినిమా మీద మేకర్స్’ అంత నమ్మకంతో ఉండాలి. మరి వారి నమ్మకం ఎంతమేర నిలబడుతుందో చూడాలి.

