Kalvakuntla Kavitha: తెలంగాణ రక్షణ సేన అధినేత్రి కవిత విలేకరుల ముందుకు వచ్చిందంటే చాలు ఏదో ఒక నిర్ణయం బయటపడింది. మీడియాకు కావలసినంత మసాలా అందిస్తూనే ఉన్నారు. మీడియాలో ఆమె విస్తృతంగా చర్చలో ఉన్నారు. భారత రాష్ట్ర సమితి నుంచి బయటికి వచ్చిన తర్వాత కవిత మొదట్లో కాస్త హుందాగానే మాట్లాడారు. కొన్ని విషయాలు మాత్రమే మీడియాకు చెప్పేవారు. కానీ ఇప్పుడు ఆమె పూర్తిగా మారిపోయింది. ప్రతి పరిశీలన కుండబద్దలు కొట్టినట్టు చెబుతూనే ఉన్నారు.
తెలంగాణ రక్షణ సేన పార్టీని ఏర్పాటు చేసిన తర్వాత కల్వకుంట్ల కవిత భారత రాష్ట్ర సమితిపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు. కేసీఆర్ నుంచి మొదలుపెడితే కేటీఆర్ వరకు ఎవరిని వదిలిపెట్టకుండా తిడుతూనే ఉన్నారు. ప్రజా సమస్యలపై ఆరోపణలు చేస్తున్నారు.. నిరసనలు.. ఆందోళనలు చేస్తున్నారు. అంతేకాదు.. అనేక అంశాల మీద రౌండ్ టేబుల్ సమావేశాలు కూడా ఉన్నాయి. కవిత తెలంగాణ రాజకీయాలలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుతున్నాయి.
ఇటీవల ఇడుపు కాయితం అన్న సినిమాకు సంబంధించి వివాదం ఏర్పడిన నేపథ్యంలో కల్వకుంట్ల కవిత స్పందించారు. ఈ పదానికి అర్థం తెలియాలంటే పవన్ కళ్యాణ్ ను అడగాలని కవిత పరోక్షంగా. ఈ వివాదంలోకి పవన్ కళ్యాణ్ ను లాగారు కవిత. అంతేకాదు ఇటువంటి విషయాల మీద భారత రాష్ట్ర సమితి నాయకులు ఇప్పుడు మాట్లాడే అవకాశం లేకుండా పోయిందని కవిత చెప్పారు. అక్కడితోనే కవిత ఆగిపోలేదు.. మరో నాయకుడి మీద కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.
శ్రీ చైతన్య, నారాయణ విద్యాసంస్థలతో గుంట నక్కలాంటి నాయకుడు పాల వ్యాపారం చేస్తున్నాడని కవిత. అటువంటి వ్యక్తి భారత రాష్ట్ర సమితిలో కొనసాగడం ఆ పార్టీ చేసుకున్న దరిద్రమంటూ ఆమె. గుంటనక్క అని కవిత సంబందించిన ఆ వ్యక్తి ఎవరని సోషల్ మీడియాలో తెగ చర్చ నడుస్తోంది. తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు ఆంధ్రకు సంబంధించిన విద్యాసంస్థల విషయంలో ఉద్యమకారులు తీవ్రంగా స్పందించారు. శ్రీ చైతన్య, నారాయణ విద్యాసంస్థల మీద కూడా దాడులు చేశారు.
ఇటీవల కాలంలో భారత రాష్ట్ర సమితికి సంబంధించిన ఓ కీలక నాయకుడు ఆ రెండు విద్యాసంస్థలకు పాలు పోస్తున్నారని.. వ్యాపారం సాగిస్తున్నారని కవిత. ఇటీవల కాలంలో హరీష్ రావు పేరు ప్రస్తావించకుండా గుంట నక్క అని కవిత అంటున్నారు. బహుశా విద్యా సంస్థలతో వ్యాపారం చేస్తున్నది ఆయనేనని తెలంగాణ రక్షణ సేన నాయకులు అంటున్నారు. హరీష్ రావు భార్య పాల వ్యాపారం చేస్తున్నారు. ఒక డెయిరీ కూడా ఆమె ఏర్పాటు చేశారు. అందువల్లే కవిత ఈ ఆరోపణలు చేసింది. మరి దీనిపై హరీష్ రావు వర్గం నాయకులు ఏ విధంగా ఉన్నారో చూడాల్సి ఉంది.

