China Salt: ఆ ఉత్పత్తులకు గ్యారెంటీ ఉండదు. వాటి పనితీరుకు వారంటీ ఉండదు.. చైనా తయారు చేసే ప్రొడక్ట్స్ మీద సోషల్ మీడియాలో కనిపించే జోక్ ఇది. నిజంగానే చైనా ఉత్పత్తిలో చూపించే దూకుడు తన నాణ్యతలో చూపించాడు. పనితీరులో ప్రదర్శించబడింది. అత్యంత తక్కువ ధరలో ఉత్పత్తులను అందించడం వలన చైనాకు ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ ఉంటుంది. తక్కువ ధరలలో లభిస్తుంది కాబట్టి అన్ని దేశాలు ఆ ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి ఆసక్తిని చూపిస్తాయి.
చైనాలో తయారయ్యే ఉత్పత్తులు మాత్రమే కాదు.. చివరికి ఆహారానికి సంబంధించిన పదార్థాలు కూడా అత్యంత డేంజర్‌గా ఉంటాయి. ముఖ్యంగా చైనాకు సంబంధించి వాడే సాల్ట్ దీనిని అజినోమోటో అని పిలుస్తుంటారు. దీనిని ఫాస్ట్ ఫుడ్‌లలో ఎక్కువగా వాడుతూ ఉంటారు. కానీ ఇది అత్యంత ప్రమాదకరమైనది. ఇది రోజుకు అయిదు గ్రాముల కంటే ఎక్కువ తీసుకుంటే శరీరానికి కీడు చేస్తుంది. చైనా ఉప్పులో గ్లూటామిక్ యాసిడ్ అధికంగా ఉంటుంది. దీనిని వాడితే నాడీ వ్యవస్థ తీవ్రంగా ప్రభావితమవుతుంది. మెదడు పనితీరు కూడా దెబ్బతింటుంది. ఒబెసిటీ.. మైగ్రేన్.. హాయ్ బీపీ వంటి రుగ్మతలకు. వాడే వరకు గర్భిణీలు దీనిని ఉపయోగించకపోవడమే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.
చైనాలో ఫాస్ట్ ఫుడ్ ఎక్కువగా అమ్ముతూ ఉంటారు. గతంలో ఇటువంటి ఆహారం మనదేశంలో అంతగా ఉండేది కాదు. కానీ కొన్ని సంవత్సరాలుగా చైనా ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో మనదేశంలో కూడా విరివిగా ఏర్పాటైంది. చైనా ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో ఎక్కువగా ఫ్రైడ్ రైస్.. నూడుల్స్ తయారు చేస్తూ ఉంటారు. వీటిల్లో రుచి కోసం చైనా సాల్ట్ వాడుతూ ఉంటారు. ఇది తాత్కాలికంగా రుచి కలిగించేలా.. దీర్ఘకాలంలో శరీరం మీద అనేక రకాలుగా దుష్పరిణామాలను చూపిస్తూ ఉంటుంది. మెదడు.. హృదయం.. జీర్ణాశయానికి సంబంధించిన అనేక వ్యాధులను కలిగిస్తుంది. అందువల్లే చైనా సాల్ట్ ను చాలావరకు దేశాలు నిషేధించాయి. మనదేశంలో మాత్రం ఇది యధావిధిగా అమ్ముడుపోతోంది. ముఖ్యంగా ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో దీనిని విపరీతంగా వాడుతున్నారు. దీని వాడకాన్ని నిరోధిస్తేనే ప్రజల ఆరోగ్యాలు బాగుంటాయని వైద్యులు చెబుతున్నారు.
చైనా సాల్ట్ లో కృత్రిమ పదార్థాలను అధికంగా వాడుతారు. దీనివల్ల అది కొంచెం నోట్లో వేసుకోగానే ఒక రకమైన రుచి కలుగుతూ ఉంటుంది. పైగా చైనా సాల్ట్ లో రకరకాల రసాయనాలు ఉంటాయి. అవి చూసేందుకు స్పటికాల మాదిరిగా ఉంటాయి. దీనివల్ల శరీరం మీద ముఖ్యంగా అంతర్గత అవయవాలు తీవ్రంగా ప్రభావితమవుతాయి. పరిమితికి మించి వీటిని తీసుకుంటే శరీరం అనేక రకాల రుగ్మతలకు గురవుతుంది.

