జంతర్ మంతర్ : సాధారణంగా రాముడి నామం మీద పేటెంట్ రైట్స్ మొత్తం బిజెపికి ఉంటాయి. ఎందుకంటే ఆ పార్టీ రాముడి నామం జపించడంలో ఏమాత్రం వెనుకాడడు. పైగా ఆ పార్టీకి సెక్యులర్ రాజకీయాలు ఉండవు. హిందుత్వ నినాదం విషయంలో బిజెపి కాంప్రమైజ్ కాదు. బహిరంగంగానే హిందువుల గురించి సానుకూలంగా మాట్లాడుతూ ఉంటుంది. తమది హిందుత్వ పార్టీ అని చెప్పేస్తుంటుంది.
అయోధ్య రామ మందిర నిర్మాణం కోసం విశ్వహిందూ పరిషత్.. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఎలా అయితే కృషి చేశాయో.. బిజెపి కూడా అదే స్థాయిలో కష్టపడి పని చేసింది. క్షేత్రస్థాయిలో రామ మందిర నిర్మాణ ఆవశ్యకతను దేశ ప్రజలకు అర్థమయ్యేలా చెప్పగలిగింది. రామ మందిర నిర్మాణాన్ని కూడా గొప్పగా ఉండేలా చేసింది. కాకపోతే నిర్వాహక కమిటీ నిర్లక్ష్యం వల్ల భారతీయ జనతా పార్టీ తలదించుకోవాల్సి వచ్చింది. అయినప్పటికీ రామ మందిర నిర్వహణలో జరుగుతున్న అక్రమాలపై నిజాలు బయట పెట్టడానికి ఏకంగా ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించింది. ఇప్పటికే చాలామందిని అరెస్ట్ చేసింది.
భారతీయ జనతా పార్టీకి.. రాముడికి అవినాభావ సంబంధం ఉంటుంది. ఈ సంబంధమే ఆ పార్టీని దేశంలో మూడుసార్లు అధికారంలోకి రాగలిగేలా చేసింది. దీనిని కొట్టడానికి విపక్ష పార్టీలు చేయని ప్రయత్నం లేదు. తాజాగా అయోధ్య వ్యవహారంలో విపక్ష పార్టీలు గొంతు సవరించడం మొదలుపెట్టాయి. భారతీయ జనతా పార్టీని కార్నర్ చేయడం మొదలు పెట్టాయి. ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు ఒక్క దశలో భారతీయ జనతా పార్టీకి మాట్లాడే అవకాశం లేకుండా పోయింది. ఇప్పుడిక జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న ధర్నా విషయంలో కూడా కాక్రోచ్ జనతా పార్టీ నాయకులు రామ నామాన్ని జపించారు.
ఒక చేతిలో జైశ్రీరామ్ అని రాసిన ఫ్ల కార్డు.. మరో చేతిలో విప్లవం వర్ధిల్లాలి అనే ప్లకార్డు పట్టుకున్నారు. సీజేపీ నాయకులు ఇలా చేస్తారని కమలం పార్టీ నాయకులు అసలు ఊహించలేదు. పైగా బిజెపి నాయకులకు కౌంటర్ ఇవ్వడానికి కాక్రోచ్ జనతా పార్టీ నాయకులు అనేక రకాల ప్రయత్నాలు ప్రారంభించారు. సోషల్ మీడియాను విపరీతంగా వాడుకున్నారు. దీనితో వారు చేస్తున్న ధర్నాకు విశేషమైన గుర్తింపు లభించింది. ప్రతిపక్షాలు కూడా ఆలోచించని విధంగా కాక్రోచ్ జనతా పార్టీ నాయకులు ఆలోచించడం ఆసక్తికరంగా మారింది. అయితే ఎన్ని రకాలుగా కాక్రోచ్ జనతా పార్టీ నాయకులు ప్రయత్నాలు చేసినప్పటికీ.. జనతా పార్టీ ఐటి విభాగం అత్యంత లోతుగా వీడియోలు.. భారతీయులను బయటకు తీయడంతో.. కాక్రోచ్ జనతా పార్టీ నాయకులు ఆశించిన లక్ష్యాలు మాత్రం నెరవేరలేదు. ఏది ఏమైనప్పటికీ ఇన్ని రోజుల వరకు రాముడు కేవలం బిజెపి నాయకులకు మాత్రమే ఇలవేల్పులాగా ఉండేవారు. ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ నాయకులు రాముడిని తమ అవసరాల కోసం వాడుకోవడం మొదలుపెట్టారు. బిజెపి నాయకులకు షాకిచ్చారు.

