వైసీపీ అధినేత జగన్ ఆవేదన చెందుతున్నారా ? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిణామాలు.. పార్టీని ముందుకు నడిపించే విషయంలో జరుగుతున్న పొరపాట్లు.. వంటి అంశాలను ఇటీవల ఆయన చర్చించారు. ఈ పార్టీ విషయంలో గతంలో జరిగిన పరిణామాలు అదేవిధంగా సీనియర్ నాయకుల నుంచి ఎదురైనా ఇబ్బందులు కొందరు నాయకులు పార్టీని వీడే తర్వాత ఆ తర్వాత వచ్చిన గ్యాప్ గురించి ఆయన చర్చించారు.
ఈ కోరిక “బాలినేని శ్రీనివాసరెడ్డి సహా మోపిదేవి వెంకటరమణ వంటి నాయకులను అదేవిధంగా బీసీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళని వదులుకొని పొరపాటు చేశామా” అన్న మాట జగన్ నుంచి వచ్చినట్లు తెలిసింది. నిజానికి అధినేత అంటేనే పోయే వాళ్ళని వైసీపీ పోనివ్వండి అనే టైపు. కానీ ఇలా చేయడం వల్ల పార్టీ ఇప్పుడు బలహీనపడింది. ఇప్పటికే చాలా నియోజకవర్గాల్లో బలహీనపడింది.
ఈ కోరికనే కొన్నాళ్లకి పార్టీ నుంచి వెళ్లిపోయిన వాళ్ళు తిరిగి వచ్చినా ఆహ్వానం పలుకుతామని జగన్ ప్రకటించారు. కానీ.. వెళ్లిపోయిన వాళ్లే తప్ప, వచ్చిన వాళ్ళు ఒక్కళ్ళు కూడా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో సీనియర్ల ఆవశ్యకత, నియోజకవర్గం.. అదేవిధంగా జిల్లాల స్థాయిలో పార్టీని నడిపించే నాయకుల అవసరం ఎంతో ఉందన్నది వైసిపి నేతల మధ్య జరుగుతున్న చర్చ. ఈ విషయంపైనే ఇటీవల జగన్ నిర్వహించిన ప్రెస్ మీట్ అనంతరం నాయకులతో అంతర్గతంగా చర్చలు జరిపారు.
సీనియర్ నాయకులు వెళ్లిపోయిన అంశం ఈ సందర్భంగా చర్చించారు. అయితే ఒక్కళ్ళు కూడా వెనక్కి రాకపోవడం.. భవిష్యత్తు పరిణామాలు.. ఏంటి అంటే ఆలోచించి వచ్చే నాయకులకు ఆహ్వానం పలకాలని మరోసారి చెప్పినట్టు తెలిసింది. ఎవరు ఎప్పుడు వచ్చినా చెప్పారు. కానీ, ఒకవైపు పార్టీపై జరుగుతున్న ప్రచారం.. ప్రత్యర్థుల నుంచి ఎదురవుతున్న ఒత్తిళ్ల కారణంగా వైసిపి విషయంలో ప్రజల ఆలోచన సరళి ఏమాత్రం మెరుగు పడలేదని సీనియర్లు వివరించారు.
దీంతో వచ్చేవాళ్ళు కూడా రావడం లేదని, ఉన్న కొద్దిమంది నాయకులు కూడా క్షేత్రస్థాయిలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని జగన్ కు సమాచారం చేరింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఆయన మరోసారి పాదయాత్ర వరకు వేచి చూడాలని పార్టీ పుంజుకుందని వారికి భరోసా అయితే కల్పించారు. కానీ, అంతర్గతంగా మాత్రం జగన్‌లో ఆవేదన కనిపించిందని ఓ సీనియర్ నాయకుడు వ్యాఖ్యానించటం విశేషం.

