వైఎస్ జగన్ మోహన్ రెడ్డి : రాజ ద్రోహం కేసులో అరెస్టై జైల్లో ఉన్న రావణ్.. అలియాస్ జోసెఫ్ కు సంబంధించి ఏదో ఒక వార్త మీడియాలో కనిపించింది. ఇటీవల కాలంలో జోసెఫ్ కు వైసీపీ అధినేత జగన్ బహిరంగంగానే మద్దతు పలికారు. చంద్రబాబును.. పవన్ కళ్యాణ్ ను వ్యక్తిగతంగా టార్గెట్ చేసి విమర్శలు చేసిన జోసెఫ్ ను జగన్ సమర్థించారు. పైగా ఆయనను అరెస్ట్ చేయడానికి ఖండించారు. దీంతో రావడం వెనక ఎవరున్నారు అంటే దానిమీద క్లారిటీ వచ్చిందని టిడిపి నేతలు అంటున్నారు.
రావణ్ అరెస్టు తర్వాత అతని భార్య తెర మీదకి వచ్చింది. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఆమెను ఇంటర్వ్యూ చేశాయి. పవన్ కళ్యాణ్ మీద రావణ్ సతీమణి విమర్శలు చేసింది. రావణ్ కేసును విచారిస్తున్న పోలీసులకు సంచలన నిజాలు తెలుస్తున్నాయి. ఆయన ఫోన్లో బూతు వీడియోలు ఉన్నాయని.. దేశ వ్యతిరేక శక్తులకు సమాచారం.. కీలక విషయాలు అందులో ఉన్నాయని పోలీసులు గుర్తించారు. ఆ బూ వీడియోల ద్వారా రావణ్ అనేకమంది అమ్మాయిలను వేధించాడని.. ఇబ్బంది పెట్టాడని చూపిస్తున్నాడు. సుమారు పది మంది మహిళలు అతడి బాధితులని సమాచారం.
రావణ్ వ్యవహారం ఇలా సాగుతుండగానే.. మరొక కీలక విషయం బయటకు వచ్చింది. రావణ్ తో పాటు ప్రశ్న బృందంలో పనిచేసే గగన అనే అమ్మాయి గన్నవరం విమానాశ్రయానికి వచ్చింది. రావణ్ అరెస్ట్ అయిన తర్వాత గగన పవన్ మీద వ్యక్తిగతంగా విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఆమె కొంతమంది సంఘీభావంగా నిలబడిన విషయం కూడా తెలుస్తుంది. అయితే గగన గన్నవరం విమానాశ్రయంలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని కలిసింది. గగన ను చూడగానే జగన్ వెనక్కి వచ్చారు. ఆమె నెత్తి మీద చేయి వేసి ఆశీర్వదించారు. అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఆ సమయంలో జగన్ వెంట దేవినేని అవినాష్ ఉన్నారు. గగన సాధారణంగా వైసీపీకి అనుకూలంగా మాట్లాడుతోంది. నేతలపై తీవ్రస్థాయిలో విమర్శలు కూటమి చేస్తోంది. ప్రశ్న బృందం వెనుక జగన్మోహన్ రెడ్డి ఉన్నాడని ఎప్పటినుంచో టిడిపి నేతలు చెబుతున్నారు. గగన జగన్మోహన్ రెడ్డిని కలవడం.. అతడు ఆమెను ఆశీర్వదించడం.. కొద్దిసేపు మాట్లాడటం వంటి పరిణామాలు గన్నవరం విమానాశ్రయంలో చోటు చేసుకున్న నేపథ్యంలో టిడిపి నేతలు అసలు విషయాలను వెల్లడిస్తున్నారు. ప్రశ్నల బృందాన్ని వైసిపి నేతలు పెంచి పోషించారని.. కూటమి నేతల పై ఉసిగొల్పారని టిడిపి నేతలు ఆరోపిస్తున్నారు.

