జగిత్యాల జిల్లాలో ఉరుముల మెరుపులతో కూడిన వర్షం కురిసింది. ఆదివారం ( జూన్ 21 ) సాయంత్రం ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. దీంతో జగిత్యాలలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. అప్పటివరకు ఎండవరకు వేడితో అల్లాడిన జనం కొంతమేర ఉపశమనం పొందారు.
జగిత్యాల పట్టణంతో పాటు పరిసర గ్రామీణ ప్రాంతాలు కూడా ఓ మోస్తరు వర్షం కురిసింది. వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈదురుగాలికి పలు చోట్ల చెట్ల కొమ్మలు విరిగిపడటంతో విద్యుత్ అంతరాయం ఏర్పడింది. వర్షంతో వాతావరణం ఆహ్లాదకరంగా మారడంతో జనం ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలా.. ఈ వారం దాటితే మాన్సూన్ మరింతగా విస్తరించి ఉండగా పరిస్థితులు ఏర్పడుతున్నాయని ఐఎండీ చెబుతున్నది. ప్రస్తుతానికి రుతుపవనాలు బలహీనంగానే ఉన్నా.. తెలంగాణ సహా దక్షిణాది రాష్ట్రాల్లో చెప్పుకోదగిన స్థాయిలో వర్షాలు కురుస్తున్నాయి. జులై 1 వరకు రాష్ట్రంలో ఉండే వాతావరణ పరిస్థితులపై ఐఎండీ తాజా అంచనాలను విడుదల చేసింది. ఇప్పటిదాకా వేడిగాలుల ప్రభావం, పశ్చిమ, తూర్పుగాల మధ్య హోరాహోరీ ఎఫెక్ట్ రుతుపవనాలు స్తంభించిపోయాయి.
►ఇంకా చదవండి | భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఘోర ప్రమాదం… అదుపుతప్పి చెట్టును ఢీకొన్న కారు.. ముగ్గురు మృతి…
రాష్ట్రంలో ఈ రెండు వారాల సాధారణ కన్నా తక్కువ వర్షాలే పడేందుకు ఐఎండీ అంచనాల్లో కూడా ఉంది. కేవలం కొంకణ్, గోవా, కర్నాటక, రాయలసీమ, కేరళ, తమిళనాడుల్లో మాత్రమే సాధారణం లేదా సాధారణం కన్నా ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేసింది. మిగిలిన దేశమంతా లోటు వర్షపాతమే రికార్డ్ అవుతుందనిహెచ్చరించింది.

