జన నాయకన్ ట్విట్టర్ రివ్యూ: తమిళనాడు ముఖ్యమంత్రి హీరోగా నటించిన చివరి చిత్రం ‘జన నాయకన్ ‘ నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. విడుదలకు ముందు ఈ చిత్రం ఎదురుకున్న ఇక్కట్ల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎట్టకేలకు వాటి అన్నిటిని విజయవంతంగా ఎదురుకొని నేడు ఈ సినిమా గ్రాండ్ గా విడుదలైంది. ఇది టాలీవుడ్ లో బాలయ్య హీరో గా నటించిన భగవంతుడు కేసరి కి రీమేక్ అనే సంగతి అందరికీ తెలిసిందే. కానీ మేకర్స్ అలా ప్రమోట్ చేయకుండా , కేవలం సన్నివేశాలను మాత్రమే తీసుకున్నాం అంటూ ప్రచారం చేశారు. కానీ ట్రైలర్ చూస్తే భగవంత్ కేసరి కి జిరాక్స్ కాపీ అంటే చెప్పాలి. మరి ఈ తమిళ వెర్షన్ భగవంత్ కేసరి ఆడియన్స్ ని అలరించిందా లేదా అనేది ఇప్పుడు మనం చూడబోతున్నాం.
#జననాయకన్ విజయ్‌కి బాధాకరమైన వీడ్కోలు!
కొన్ని ఎలివేషన్ బ్లాక్‌లు మరియు ప్రదేశాలలో అనిరుధ్ స్కోర్ మినహా, ఇక్కడ ఏదీ పని చేయదు. హెచ్.వినోత్ ఎగ్జిక్యూషన్ చాలా స్లోగా ఉంది మరియు అతను చేసిన మార్పులు, ముఖ్యంగా సబ్ప్లాట్లు పూర్తిగా పాతవిగా అనిపిస్తాయి. బాబీ డియోల్ విలన్ ట్రాక్…
— వెంకీ రివ్యూస్ (@venkyreviews) జూలై 23, 2026
ముందుగా ఫస్ట్ హాఫ్ గురించి నెటిజెన్స్ ఏమంటున్నారో ఒకసారి గమనించారు, ఇంటర్వెల్ సన్నివేశాలు చాలా సాలిడ్ గా ఉన్నాయి , కొన్ని ఎలివేషన్ సన్నివేశాలు వర్కౌట్ అయ్యాయి కానీ , డైరెక్టర్ టేకింగ్ మాత్రం అసలు బాగాలేదని, బాబీ డియోల్ ట్రాక్ చాలా చెత్తగా ఉందని అంటున్నారు. అంతే కాకుండా VFX వర్క్ చాలా దారుణంగా ఉందని , సినిమాకు అతి ముఖ్యమైన కూతురు ఎమోషన్ సరిగా పండలేదని అంటున్నారు. ఫస్ట్ హాఫ్ మొత్తం విజయ్ , అనిరుద్ మాత్రమే ప్లస్ పాయింట్స్ గా నిలిచారని , వాళ్ళ పనితనం తప్ప , ఫస్ట్ హాఫ్ ఏమి లేదని చెప్పుకొచ్చారు. సెకండ్ హాఫ్ లో కూడా ఇదే పరిస్థితి. కొన్ని ఎలివేషన్ సన్నివేశాలు వర్కౌట్ అయ్యాయి అట , అనిరుద్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగా కలిసొచ్చింది అట. కానీ ఓవరాల్ సినిమా మాత్రం ఆకట్టుకోలేకపోయింది. భగవంత్ కేసరి ని డిట్టో దింపినా బాగుండేది , కానీ డైరెక్టర్ వినోద్ చేసిన మార్పులు ఈ సినిమా కొంపమించిందని అంటున్నారు.
భగవంత్ కేసరి బెటర్ సినిమా…. అనిల్ రావిపూడి బెటర్ డైరెక్టర్…
బాలయ్య సుపీరియర్ యాక్టర్
అని చెప్పడానికి తీసిన సినిమా లా ఉంది #జననాయకన్
— జర్నలిస్ట్ నిశాంత్ (@NishantOpinions) జూలై 23, 2026
ఇక విలన్ గా చేసిన బాబీ డియోల్ క్యారెక్టర్ ని చూస్తే నవ్వు వచ్చేలా ఉందని అంటున్నారు నెటిజెన్స్. అంతా వీక్ గా డిజైన్ చేశారట. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా అసలు బాగాలేదని , సినిమా స్క్రీన్ ప్లే ఒక ఫ్లోలో వెళ్లకుండా, ఎమోషనల్స్ మధ్యలో అతికించినట్టు ఉండటంతో , ఒరిజినల్ వెర్షన్ లో కలిగే ఎమోషనల్ ఫీలింగ్ ఈ సినిమా ని చూస్తున్నంతసేపు పొందలేమని, ఇక క్లైమాక్స్ సన్నివేశం అయితే మన సహనానికి పరీక్ష పెడుతుందని అంటున్నారు. ఓవరాల్ గా విజయ్ ని చివరిసారిగా వెండితెర మీద చూసుకోవాలని అనుకున్న వాళ్ళు మాత్రమే ఈ సినిమాకు వెళ్లగలరని , మామూలు ఆడియన్స్ చూడలేరని అంటున్నారు.
పీక్ టైటిల్ కార్డ్ పీక్ మూవీ #జననాయకన్ pic.twitter.com/v2JWBDuoBk
— Pokkiri_Victor (@Pokkiri_Victor) జూలై 23, 2026
#జననాయకన్ – భగవంత్ కేసరి నుండి తీసిన మమితాబైజూకి సంబంధించిన కొన్ని సన్నివేశాలు కాకుండా, హెచ్‌వినోత్ రచన & స్క్రీన్‌ప్లేతో రూపొందించబడిన రెండవ సగం ఒక ప్రత్యేకమైనది.
ముఖ్యంగా 45 నిమిషాల ఫ్లాష్‌బ్యాక్ పూర్తిగా హెచ్‌వినోత్ కథ, పూర్తి రాజకీయ అంశాలతో ముడిపడి ఉంది… pic.twitter.com/XBkhX98KtE
— AmuthaBharathi (@CinemaWithAB) జూలై 23, 2026
తండ్రీకూతుళ్ల అనుబంధంలో విజయ్ మరియు మమిత బైజుల కంటే బాలయ్య మరియు శ్రీలీల కెమిస్ట్రీ ఎక్కువ.
తమిళనాడు వర్సెస్ హెచ్ వినోద్ చేయాలనుకున్న యాక్షన్ ఎంటర్టైనర్ కోసం మంచి రేపటి కోసం ప్రపంచానికి విజయ్ యొక్క PSA మధ్య సినిమా వివాదంలో ఉంది.#జననాయకన్
– అన్మోల్ జమ్వాల్ (@జమ్మీప్యాంట్స్4) జూలై 23, 2026

