జన నాయకన్: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన చివరి చిత్రం ‘జన నాయకన్’ విడుదలపై ఇంకా సస్పెన్స్ వీడలేదు. జనవరి 9న సంక్రాంతి కానుకగా విడుదల అవ్వాల్సిన ఈ సినిమా సెన్సార్ సభ్యులు కొన్ని సన్నివేశాలకు అభ్యంతరం వ్యక్తం చేయడం , మేకర్స్ ఒప్పుకోకపోవడం , ఆ తర్వాత కోర్టుకు వెళ్లడం , కోర్టు కూడా సెన్సార్ బోర్డు సభ్యులకు మద్దతు ఇవ్వడం , ఇక చేసేది ఏమి లేక , మేకర్స్ సెన్సార్ సభ్యులు సూచించిన మార్పులు చేయడానికి అంగీకరించడం జరిగింది. కానీ సెన్సార్ సభ్యులు ఇప్పటికీ ఈ సర్టిఫికేట్ జారీ చేయలేకపోతున్నారు. కానీ ఇప్పుడు సెన్సార్ సర్టిఫికెట్ కి క్లియరెన్స్ వచ్చే అవకాశం జూన్ 19న ఈ విడుదల చేయబోతున్నట్టు మేకర్స్ రీసెంట్ గానే అధికారికంగా ప్రకటించారు.
ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ గతం లో చాలా పెద్ద ఎత్తులోనే జరిగింది. విజయ్ చివరి చిత్రం అనే పబ్లిసిటీ భారీ రేంజ్ లో జరగడం తో , బయ్యర్స్ పోటీ పడి మరీ ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ ని కొనుగోలు చేశారు. అయితే జనవరి 9 నుండి ఈ సినిమా వాయిదా పాడడం, నెలల తరబడి విడుదల విషయంలో జాప్యం జరగడంతో ఈ కొనుగోలు చేసిన బయ్యర్స్ కి మేకర్స్ డబ్బులు తిరిగి ఇచ్చేసారు , ఇంకా కొంతమందికి తిరిగి ఇవ్వాల్సి ఉంది. అయితే ఏ బయ్యర్స్ కి ఈ సినిమా డబ్బులను తిరిగి ఇచ్చేస్తారో, ఇప్పుడు వాళ్ళే ఈ భారీ రేట్స్ తో కొనుగోలు చేయడానికి ముందుకొచ్చారట. కానీ KVN సంస్థ తాము ఇచ్చిన డబ్బులతో పాటు, వడ్డీతో సహా చెల్లిస్తేనే ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ ని మీకు అమ్ముతానని చెప్పారట.
ఈ విషయం సీఎం విజయ్ కి తెలిసింది. ఆయన తక్షణమే చర్యలు ఆపేయాల్సిందిగా సూచించాడు. అదే విధంగా మిగిలిన బయ్యర్స్ కి కూడా డబ్బులు తిరిగి ఇచ్చేసి , ఈ సినిమాని సొంతంగా విడుదల చేసిన నిర్మాతలకు విజయ్ సూచించినట్లు, అందుకు నిర్మాతలు కూడా ఓకే చెప్పినట్టు సమాచారం. సాటిలైట్, ఓటీటీ రైట్స్ కూడా సెన్సార్ సర్టిఫికెట్ వచ్చిన తర్వాత విక్రయించాల్సిందిగా సీఎం విజయ్ కోరాడట , అందుకు కూడా మేకర్స్ ఓకే చెప్పినట్టు. విజయ్ చివరి చిత్రం , అది కూడా ముఖ్యమంత్రి అయ్యాక విడుదల అవ్వబోతున్న మొదటి చిత్రం, ఇక బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల సునామీ ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించుకోవచ్చు. విజయ్ కెరీర్ లో అత్యధిక వసూళ్లను రాబట్టిన చిత్రం లియో , దాదాపుగా 650 కోట్ల రూపాయల గ్రాస్ ని రాబట్టింది , ఈ రికార్డుని జన నాయకన్ అవలీలగా అవుతోందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు , చూడాలి మరి ఏమి జరగబోతుంది.

