జన నాయకన్ : తమిళనాడు సీఎం విజయ్ అభిమానుల 6 నెలల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. ఆయన హీరోగా నటించిన చివరి చిత్రం ‘జన నాయకన్’ కి ఎట్టకేలకు సెన్సార్ ఇక్కట్లు తొలగిపోయింది. ఈ సెన్సార్ బోర్డు A సర్టిఫికెట్ ని జారీ చేసింది. జనవరి 9 న ప్రపంచవ్యాప్తంగా విడుదల అవ్వాల్సిన ఈ సినిమా, సెన్సార్ బోర్డు అనేక సన్నివేశాలకు అభ్యంతరం వ్యక్తం చేయడం , వాటికి నిర్మాతలు ఒప్పుకోకపోవడం , సెన్సార్ బోర్డు సభ్యులు సర్టిఫికెట్ ఇవ్వడానికి నిరాకరించారు. దీంతో సినిమా విడుదల ని ఆపేయాల్సి వచ్చింది. మరో రెండు రోజుల్లో విడుదల, ఇలా అర్థాంతరంగా వాయిదా వేయడంతో అభిమానులు చాలా నిరాశకు గురయ్యారు. ఎందుకంటే ఇప్పటికే ప్రపంచంలో 60 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు అడ్వాన్స్ బుకింగ్స్ వచ్చాయి.
ఇక వాయిదా తర్వాత నిర్మాతలు హై కోర్టుని ఆశ్రయించారు , హై కోర్టు కూడా సెన్సార్ బోర్డుకి అనుకూలంగా తీర్పు ఇవ్వడం , దీనితో ఏమి లేక సెన్సార్ బోర్డు చెప్పిన సన్నివేశాలను కట్ చేసి , సరికొత్త ఎడిటెడ్ వెర్షన్ ని బోర్డు కి పంపడం జరిగింది. ఆ తర్వాత తమిళనాడులో ఎన్నికలు జరిగాయి , విజయ్ ముఖ్యమంత్రి అయ్యాడు , అయినా కూడా ఈ సినిమా సెన్సార్ పూర్తి విషయం లో జాప్యం జరగడం పై అభిమానులు తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేశారు. వాళ్ళ అసహనం కి ఎట్టకేలకు తెరపడింది. ఈ చిత్రం సెన్సార్ సర్టిఫికేట్ రావడంతో , ఈ నెల 24 న ప్రపంచవ్యాప్తంగా తెలుగు , తమిళ భాషల్లో గ్రాండ్ గా విడుదల చేయబడింది. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన జరగనుంది.
విజయ్ చివరి చిత్రం, పైగా ఆయన ముఖ్య మంత్రి అయ్యాక రాబోతున్న మొట్టమొదటి చిత్రం కాబట్టి ఈ సినిమా పై హైప్ మామూలు రేంజ్ లో లేదు. తమిళ రాష్ట్రాల్లోనే కాదు , తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ చిత్రం సెన్సేషనల్ ఓనింగ్స్ నమోదు అవుతుందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఇప్పటికే విజయ్ లియో , గాట్ చిత్రాలతో వరుసగా రెండు సార్లు మొదటి రోజు 100 కోట్ల గ్రాస్ వసూళ్లను కొల్లగొట్టారు. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి ఆయన ‘జన నాయకన్ ‘తో వంద కోట్ల గ్రాస్ ఓపెనింగ్ ని కొల్లగొట్టబోతున్నారు. తమిళనాడు రాష్ట్రము లో అయితే భారీ మార్జిన్ తో ఆల్ టైం రికార్డు కూడా కొడుతుందని అంటున్నారు. ఇవన్నీ జరిగితే , పైరసీ ద్వారా విడుదలకు ముందే లీకైన సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఏకైక ఇండియన్ హీరో విజయ్ పేరు చరిత్రలో నిలిచిపోతుంది అనడం లో ఎలాంటి సందేహం లేదు.

