జన నాయగన్ విడుదల తేదీ: ఈ ఏడాది జనవరి 9న సంక్రాంతి కానుకగా విడుదల అవ్వాల్సిన ‘జన నాయకన్’, సెన్సార్ సభ్యులు అడ్డుకోవడం వల్ల విడుదల ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత నిర్మాతలు కోర్టు మెట్లు ఎక్కడం, కోర్టు సినిమాని చూసి సెన్సార్ సభ్యుల నిర్ణయానికి మద్దతుగా తీర్పు ఇవ్వడం , ఆ తర్వాత సెన్సార్ సభ్యులు చెప్పిన సూచనలను బట్టి కొన్ని సన్నివేశాలను కత్తిరించడం జరిగింది. అయినప్పటికీ సెన్సార్ సభ్యులు మొన్నటి వరకు ఈ చిత్రానికి సర్టిఫికెట్ ఇవ్వలేదు. ఆ చిత్ర హీరో విజయ్ ఇప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రి అయ్యాడు కూడా సెన్సార్ బోర్డు అసలు తగ్గలేదు. అయితే లేటెస్ట్ గా అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం , ఈ చిత్రానికి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు నిన్నటితో పూర్తి అయ్యాయట.
సెన్సార్ సభ్యులు ఈ చిత్రం సర్టిఫికెట్ జారీ చేసినట్టు సమాచారం. ఈ నెల 30 న ప్రపంచవ్యాప్తంగా తెలుగు , తమిళ భాషల్లో ఈ గ్రాండ్ గా విడుదల చేసే ప్లాన్ లో ఉన్నారట. మొత్తానికి విజయ్ ముఖ్యమంత్రి అయ్యాక , ఆయన అభిమానులు చొక్కాలు చింపుకొని థియేటర్స్ లో చిందులు వేసే సమయం వచ్చేసింది. ఇప్పటికే ఈ చిత్రం ఆన్లైన్లో లీకైన సంగతి తెలిసిందే. ఎన్నో వేలమంది ఈ ఇప్పటికే వీక్షించారు. అయినా కూడా ఇది విజయ్ చివరి చిత్రం , పైగా ముఖ్యమంత్రి అయ్యాక ఆయన విడుదల అవుతున్న సినిమా కావడం ప్రేక్షకుల్లో ఈ చిత్రం అంచనాలు ఎవ్వరూ ఊహించని రేంజ్ లో ఉన్నాయి. మొదట్లో విడుదలైతే ఈ సినిమా ఓపెనింగ్స్ ఎలా ఉంటుందో తెలియదు కానీ, ఇప్పుడు కచ్చితంగా ఈ చిత్రం మొదటి రోజు 100 కోట్ల గ్రాస్ ఓపెనింగ్ వస్తుందని బలమైన నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు విజయ్ ఫ్యాన్స్.
మరి ఆ రేంజ్ కి ఈ చిత్రం వెళ్తుందో లేదో చూడాలి. మన తెలుగు లో సూపర్ హిట్ గా నిలిచిన బాలయ్య ‘భగవంత్ కేసరి’ చిత్రం ఇది రీమేక్. ఇందులో పూజ హెగ్డే హీరోయిన్ గా నటించగా, విజయ్ కి కూతురు గా ప్రేమలు ఫేమ్ మమిత బైజు నటించింది. అదే విధంగా ప్రముఖ బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ఈ చిత్రంలో విలన్ గా నటించారు. ఇప్పటికే ఈ ట్రైలర్‌కి సంబంధించిన పాటలు , సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. మరి మేకర్స్ విడుదలకు ముందు వేరే కొత్త కంటెంట్ ని విడుదల చేస్తారో లేదో చూడాలి.

