AI Impact On Journalism: వచ్చేది అంతంత మాత్రం జీతం. పైగా బండెడు చాకిరి.. సెలవులు ఉండవు.. చెప్పుకునే స్థాయిలో ప్రయోజనాలు ఉండవు.. తప్పదు కాబట్టి చాలామంది ఆ ఫీల్డ్ లో ఉంటారు. నమస్తే లకు అలవాటు పడి.. వేరే పనులు చేయడానికి కూడా ఇష్టపడరు. అలా ఉంటుంది జర్నలిస్ట్ జీవితం. ఫీల్డ్ లెవెల్ జర్నలిస్ట్ పరిస్థితి ఇలా ఉంటే.. డెస్క్ లెవెల్ లో మరింత దారుణంగా ఉంటుంది.. అర్ధరాత్రి అపరాత్రి అని తేడా లేకుండా పనిచేస్తూనే ఉండాలి.. కొన్ని ఆరోగ్యాలు కూడా సహకరిస్తాయి. మేనేజ్మెంట్లు ఉదారత చూపించవు.
అసలే పెనం మీద ఉన్న జర్నలిస్టుల బతుకులు… ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాకతో పొయ్యిలో పడ్డాయి. చాలావరకు మేనేజ్మెంట్ సంస్థలు ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ ను వాడుతున్నాయి. దీంతో ఉద్యోగులను తొలగిస్తున్నారు.. ఇప్పటికే చాలా వరకు కంపెనీలు గ్రాఫిక్స్ భాగంలో పని చేస్తున్న వారిని పక్కన పెట్టాయి. పెద్ద అనే పేరున్న ఓ ఛానల్ దాదాపు 60 మంది వరకు ఉద్యోగులను తొలగించింది. వీరిలో స్క్రిప్ రైటర్లు.. కంటెంట్ క్రియేటర్లు.. డిజిటల్ పక్కన పనిచేసేవారు.. గ్రాఫిక్స్ విభాగంలో పని చేసేవారు ఉన్నారు. దాదాపు మూడు నుంచి నలుగురు ఉద్యోగులను తొలగించింది ఆ ఛానల్.
ఆ ఛానల్ బాటలో పదవ నెంబర్ నంబర్ పేరుతో ప్రసారాలు చేస్తున్న ఛానల్ కూడా ఉద్యోగులను తొలగిస్తోంది. ఏకంగా ఇప్పటికే 30 మంది ఉద్యోగులను తొలగింపు జాబితాలో చేర్చినట్లు తెలుస్తోంది. వారిని వచ్చే నెల నుంచి రావద్దని చెప్పినట్టు సమాచారం. వారికి ఇవ్వాల్సిన అవసరాలను సెటిల్మెంట్ చేస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల అన్ని ఛానల్స్‌లో గ్రాఫిక్ విభాగాల్లో డిబిట్లతో అవసరం లేకుండా పోయింది.. స్క్రిప్ట్ రైటింగ్ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వెంటనే పూర్తవుతోంది.
ఈ నేపథ్యంలోనే మేనేజ్మెంట్లు ఈ వస్తువులను చూపిస్తూ ఉద్యోగులను తొలగిస్తున్నాయి. తొలగింపు జాబితాలోని ఉద్యోగుల్లో ఎక్కువ వేతనం.. సీనియర్లే కావడం విశేషం. అయితే ఈ రెండు ఛానల్స్ మాత్రమే కాకుండా.. మిగిలిన ఛానల్స్ కూడా అదే దారిలో ఉన్నట్టు కనిపిస్తున్నాయి. అయితే ఇప్పుడే ఉద్యోగుల తొలగింపు చేపట్టకుండా.. దశలవారీగా ఈ ప్రక్రియ చేపట్టే అవకాశం లేదని తెలుస్తోంది. మొత్తానికి ఏఐ రాకతో.. ఎలక్ట్రానిక్ మీడియా రంగం మొత్తం కుడుపులకు వస్తోంది. ఇది ఎక్కడా దారితీస్తుందో చూడాల్సి ఉంది.

