న్యూయార్క్: ఫిఫా ప్రపంచకప్‌లో ఈక్వెడార్ పెను సంచలనం సృష్టించింది. గ్రూప్‌ఇలో భాగంగా జరిగిన కీలక మ్యాచ్‌లో ఈక్వెడార్ 21 తేడాతో నాలుగు సార్లు ప్రపంచ ఛాంపియన్ జర్మనీని మట్టికరిపించింది. ఈ మ్యాచ్‌లో చారిత్రక విజయం సాధించిన ఈక్వెడార్ గ్రూప్ నుంచి మూడో జట్టుగా నాకౌట్ అర్హత. ఆట ఆరంభమైన నిమిషంలోనే లెరాయ్ సానె జర్మనీకి గోల్ సాధించి పెట్టాడు. అయితే 9వ నిమిషంలోనే ఈక్వెడార్ ఆటగాడు నిల్సన్ అంగులో అద్భుత గోల్ చేసి స్కోరును 11వ నిమిషంలో చేశాడు. తర్వాత ఇరు జట్లు మరో గోల్ సర్వం ఒడ్డి పోరాడాయి. దీనితో మ్యాచ్‌లో ఉత్కంఠ. కానీ రెండు జట్ల పటిష్టమైన డిఫెన్స్ కారణంగా ప్రథమార్ధం ముగిసే సమయానికి మరో గోల్ నమోదు కాలేదు. రెండో అర్ధ భాగంలో కూడా పోరు ఆసక్తికరంగానే కొనసాగుతోంది. ఇటు ఈక్వెడార్ అటు జర్మనీ ఆధిక్యం కోసం హోరాహోరీగా తలపడింది. 77వ నిమిషంలో గుంజాలో ప్లాటా ఈక్వెడార్‌కు రెండో గోల్ అందించాడు. ఆ తర్వాత స్కోరును సమం చేయడానికి జర్మనీ సర్వ్ ఒడ్డి పోరాడినా ఫలితం లేకుండా పోయింది. చివరి వరకు ఆధిక్యాన్ని కాపాడుకున్న ఈక్వెడార్ చిరస్మరణీయ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో ఓడినా జర్మనీ అగ్రస్థానంలో నిలిచి నాకౌట్ బెర్త్‌ను సొంతం చేసుకుంది.
నాకౌట్‌కు ఐవరీకోస్ట్
ఇదే గ్రూప్‌లో జరిగిన మరో మ్యాచ్‌లో ఐవరీకోస్ట్ 20 గోల్స్ తేడాతో కురసావ్ను ఓడించింది. ఈ గెలుపుతో ఐవరీకోస్ట్ 6 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచి నాకౌట్‌కు దూసుకెళ్లింది. ఆరంభం నుంచే ఐవరీకోస్ట్ దూకుడుడా ఆడింది. ఎటాకింగ్ గేమ్‌తో ప్రత్యర్థి జట్టును ముప్పుతిప్పలు పెట్టింది. ఇదే నికోలస్ పేపె ఏడో నిమిషంలోనే ఐవరీకోస్ట్‌కు తొలి గోల్‌ను సాధించి పెట్టాడు. ఆ తర్వాత ఐవరీ టీమ్ మరింత దూకుడుగా ఆడింది. కానీ కురసావ్ కూడా మెరుగైన ప్రదర్శనతో ప్రత్యర్థి జట్టును గోల్ సాధించకుండా చూడడంలో సఫలమైంది. ప్రథమార్ధం ముగిసే సమయానికి ఐవరీకోస్ట్ 10 ఆధిక్యంలో నిలిచింది. ద్వితీయార్ధంలో కురసావ్ స్కోరును సమం చేయడానికి తీవ్రంగా శ్రమించింది. కానీ పటిష్టమైన ఐవరీ టీమ్ డిఫెన్స్‌ను ఛేదించలేక పోయింది. ఇక 64వ నిమిషంలో నికోలస్ తన రెండో గోల్‌ను సాధించాడు. దీనితో ఐవరీ ఆధిక్యం 20కు చేరింది. దీన్ని చివరి వరకు కాపాడుకున్న ఐవరీకోస్ట్ నాకౌట్‌కు దూసుకెళ్లింది.
నెదర్లాండ్స్, జపాన్ ముందుకు
ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో నెదర్లాండ్స్, జపాన్ జట్లు గ్రూప్ఎఫ్ నుంచి నాకౌట్‌కు చేరుకున్నాయి. ట్యూనీతో జరిగిన మ్యాచ్‌లో నెదర్లాండ్స్ 31 గోల్స్ తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో నెదర్లాండ్స్ గ్రూప్‌లో అగ్రస్థానంలో నిలిచి నాకౌట్‌కు అర్హత ఉంది. ఇక స్వీడన్‌తో గ్రూప్ మ్యాచ్‌ను 11తో డ్రాగా ముగించిన జపాన్ రెండో స్థానంలో నిలిచిన తర్వాత రౌండ్‌కు దూసుకెళ్లింది. ఇక అమెరికాతో జరిగిన గ్రూప్డి మ్యాచ్‌లో టర్కీ 32 గోల్స్ తేడాతో అమెరికాను చిత్తు చేసింది. ఇదే గ్రూప్‌లో పరాగ్వే, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన మరో మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఈ గ్రూప్ నుంచి అమెరికా, ఆస్ట్రేలియా జట్లు నాకౌట్‌కు చేరుకున్నాయి.

