భారత నౌకాదళం మరింత శక్తివంతం. శత్రు దేశాల కదలికలను సమర్థంగా ఎదుర్కొనేందుకు స్వదేశీ సాంకేతికతతో రూపొందించిన మూడు అత్యాధునిక నౌకలను నేవీలోకి తీసుకురానున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 21న కోల్‌కతాలో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో ఐఎన్ఎస్ అగ్రయ్, ఐఎన్ఎస్ సంశోధక్, ఐఎన్ఎస్ దునగిరి నౌకలను జాతికి అంకితం చేయనున్నారు. తూర్పు నౌకాదళం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది.
ఐఎన్ఎస్ అగ్రయ్..
కోల్‌కతాలోని గార్డెన్‌రీచ్ షిప్‌బిల్డర్స్ అండ్ ఇంజినీర్స్ (జీఆర్ఎస్) సంస్థలో నిర్మించిన ఐఎన్ఎస్ అగ్రయ్ ఆట్రాక్ట్ రూపొందించబడింది. శత్రు జలాంతర్గాముల అన్వేషణ, అవసరమైతే దాడులు నిర్వహించడంతో పాటు స్వదేశీ విమానాలతో సమన్వయం చేసుకునే సామర్థ్యం దీనికి ఉంది.
సుమారు 88 శాతం స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన ఈ నౌకలో 30 ఎంఎం నెవల్ సర్ఫేస్ గన్‌తో పాటు వాటర్ జెట్లకు అనుసంధానించిన డీజిల్ ఇంజిన్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
ఐఎన్ఎస్ సంశోధక్
భారత నౌకాదళ హైడ్రోగ్రాఫిక్ సర్వే సామర్థ్యాలను పెంపొందించే లక్ష్యంతో ఐఎన్ఎస్ సంశోధక్‌ను నిర్మించారు.సముద్ర భౌగోళిక పరిస్థితులు, తీర ప్రాంత జలాల అధ్యయనాల కొలతలు, సముద్ర పటాల రూపకల్పన, నావిగేషన్‌కు అవసరమైన చార్టుల తయారీలో ఈ నౌకా పాత్ర కీలక పాత్ర పోషించింది.110 మీటర్ల పొడవు గల ఈ నౌకను 2023 జూన్‌లో సముద్రంలో సమగ్రంగా మార్చారు. నిర్వహించేందుకు దీనిని ప్రత్యేకంగా రూపొందించారు.హెలికాప్టర్ కార్యకలాపాలకు అనువైన సౌకర్యాలతో పాటు, ప్రకృతి విపత్తులు అత్యవసర పరిస్థితుల్లో మానవీయ సాయం లేదా సహాయక చర్యలు చేపట్టే సామర్థ్యం కూడా దీనికి ఉంది.
ఐఎన్ఎస్ దునగిరి
భారత నీవీలో విశిష్ట సేవలు అందించిన నీలగిరి శ్రేణి నౌకల స్ఫూర్తితో ఐఎన్ఎస్ దునగిరిని నిర్మించారు.
ప్రాజెక్ట్-17ఏ కింద రూపొందించిన ఈ అత్యాధునిక యుద్ధనౌకను 2022 జులై 15న జలప్రవేశం చేశారు.
దీని పొడవు 149 మీటర్లు. అడ్వాన్స్డ్ గైడెడ్ మిస్సైల్ ఫ్రిగేట్‌గా రూపొందించిన ఈ నౌక అత్యాధునిక రాడార్లు, సెన్సర్లతో బహుముఖ విధులు నిర్వహించేలా సన్నద్ధమైంది.బ్రహ్మోస్ ఆంట్ క్రూయిజ్ క్షిపణులను మోసుకెళ్లే సామర్థ్యం దీని ప్రధాన ప్రత్యేకత. సముద్ర యుద్ధాల్లో నౌకాదళానికి మరింత బలం చేకూర్చే సామర్థ్యం ఈ నౌకకు ఉంది.
నౌకాదళానికి మరింత బలం
స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ఈ నౌకలు నౌకాదళ ఆధునికీకరణలో కీలక మైలురాయిగా నిలబడ్డాయి. సముద్ర భద్రత, శత్రు కదలికలపై నిఘా, సముద్ర సామర్థ్యాలు, మానవీయ సహాయక చర్యలు, అత్యాధునిక యుద్ధాల పరంగా నేవీ బలాన్ని మరింత పెంచుతున్నాయి.

