తెలుగు చిత్రాలకు 8 పురస్కారాలు
న్యూఢిల్లీ: 72వ జాతీయ చలనచిత్రాలలో తెలుగు చిత్రాలు అవార్డుల పంట పండించాయి. 2024 సంవత్సరానికి గానూ వివిధ కేటగిరీల్లో నాలుగు తెలుగు చిత్రాలకు 8 పురస్కారాలు లభించాయి. ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ‘కమిటీ కుర్రోళ్ళు’ ఎంపికైంది. ఉత్తమ మేకప్‌లోనూ ఈ సినిమాకి అవార్డు వచ్చింది. నటులతో దర్శకుడు యదు వంశీ రూపొందించిన ఈ కొత్త మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మాతగా వ్యవహరించడం విశేషం. బాకాస్ఫీస్తో పాటు ఓటీటీలోనూ అదరగొట్టిన ఈ మూవీ ఇప్పుడు ఏకంగా రెండు జాతీయ అవార్డులను సొంతం చేసుకుంది. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన గద్దర్ అవార్డుల్లో జాతీయ సమైక్యత, మతసామరస్యం, అణగారిన వర్గాల సామాజిక అభ్యున్నతికి ఉద్దేశించిన చిత్రంగా వివిధ విభాగాల్లో మెరిసింది.
ఇక నాగ్ అశ్విన్ విజువల్ వండర్ ‘కల్కి 2898 ఏడీ’కి రెండు కేటగిరీల్లో అవార్డులను దక్కించుకుంది. అద్భుతమైన సెట్స్, విజువల్స్‌తో అలరించిన ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ అవార్డుతో పాటు, ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంగా జాతీయ అవార్డును సొంతం చేసుకుంది. ‘ఎంత గొప్పగా ఆడవు అన్నది ముఖ్యం కాదు…ఎప్పుడు ఆపవన్నదే ముఖ్యం, ‘ఒక్క రోజులో ఒక అరగంట నాకు నచ్చినట్టు గడవలేదు. దానికి జీవితాంతం ఏడుస్తూ కూర్చోలేను కదా’ వంటి సంభాషణలతో అలరించిన చిత్రం ‘లకీక్క భాస్కర్’. ì అద్భుతమైన సంభాషణలను రాసి జీవిత సత్యాలెన్నో చెప్పిన దర్శకుడు వెంకీ అట్లూరికి ఉత్తమ రచయితగా (సంభాషణలు) జాతీయ అవార్డు దక్కింది. బాకాస్ఫీస్ను ఓ ఊపు ఊపేసిన చిత్రం ‘పుష్ప2′ ఏకంగా రెండు జాతీయ అవార్డులను సొంతం చేసుకుంది. ఈ మూవీని ఆద్యంతం అలరించేలా తీర్చిదిద్దిన దర్శకుడు సుకుమార్ ఉత్తమ స్క్రీన్‌ప్లే (ఒరిజినల్) కేటగిరిలో అవార్డుకు ఎంపిక కాగా, ఉత్తమ కాటూయూమ్ డిఫినిషన్గా దీపాలి నూర్, సీతల్ శర్మలకు అవార్డు దక్కింది. చిన్న చిత్రం కాదు…ప్రతి ఒక్కరి మనుషుల్ని హత్తుకునేంత పెద్ద చిత్రమనిపించింది ’35-చిన్న కథ కాదు’. ఇప్పుడు జాతీయ అవార్డుల్లో ఉత్తమ బాలల చిత్రంతో పాటు, ఉత్తమ బాల నటుడిగా అరుణ్‌దేవ్ పోతుల అవార్డుకు ఎంపికయ్యారు.

