– ప్రకటన –
నవతెలంగాణ – హైదరాబాద్: జానీ మాస్టర్‌పై ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ క్రమశిక్షణ చర్యలు చేపట్టింది. ఫెడరేషన్ నిబంధనలకు విరుద్ధంగా వ్యాఖ్యలు చేయడం, సభ్యుల అభిప్రాయాలను పట్టించుకోకపోవడం, వివాదస్పద చేయడం వంటి కారణాలతో ఆయనకు సహాయ నిరాకరణ ప్రకటించారు. జానీ మాస్టర్ ఏ సినిమాలో పనిచేసినా 23 క్రాఫ్ట్‌ల సభ్యులు సహకరించారని తెలిపిన ఫెడరేషన్, విచారణకు హాజరుకాకపోవడంపై కూడా అభ్యంతరం వ్యక్తం చేసింది. నిర్ణయించిన గడువులో సరైన వివరణ ఇవ్వకపోతే శాశ్వత బహిష్కరణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఈ పరిణామం టాలీవుడ్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఒకవేళ ఫెడరేషన్ ప్రకటించిన సహాయ నిరాకరణ అమల్లోకి వస్తే.. జానీ మాస్టర్‌తో సినిమా చేయాలనుకునే నిర్మాతలు, దర్శకులకు ఇది పెద్ద అడ్డంకిగా మారనుంది.
– ప్రకటన –

