- వృత్తిలో ఎదుగుదల, గుర్తింపు లేకపోవడం ఉద్యోగుల అసంతృప్తికి కారణం.
- పని ఒత్తిడి, ఆఫీస్ రాజకీయాలు, వ్యక్తిగత సమయం కొరవడటం.
- మానసిక ఆరోగ్యం, మెరుగైన అవకాశాల కోసం ఉద్యోగాలు వదిలేస్తాయి.
2026లో ఉద్యోగాలు వదులుకోవడం: ఈ మధ్యకాలంలో బాజ్ మానేయాలనుకునేవారి సంఖ్య పెరుగుతుంది. దానికి సంబంధించిన సోషల్ మీడియాల్లో.. జాబ్ పోర్టల్స్‌లో పలు పోస్ట్‌లు చేస్తూ అసహనం వ్యక్తం చేశారు. జాబ్ స్ట్రెస్, ఉద్యోగం మానేయాలనుకుంటున్నాను..బర్నౌట్ అయిపోయాను.. వర్క్-లైఫ్ బ్యాలెన్స్ లేదు వంటి పోస్టులు ఎక్కువైపోయాయి. ఇంకా తాము ఎదుర్కొంటున్న సమస్యలు బహిరంగంగా చెబుతున్నారు. ఇంతకీ జాబ్ మానేయాలని అనిపించడానికి ఏవి కారణాలు అవుతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
ఏళ్లుగా పని చేస్తున్నా.. గ్రోత్ లేకపోవడం
కొత్త జాబ్ ఆఫర్ లేకుండా ఉద్యోగులు ఎందుకు నిష్క్రమిస్తారు
మూడేళ్లుగా అదే పని చేస్తున్నాను.. కెరీర్ పరంగా ఎలాంటి గ్రోత్ లేకపోవడం. కెరీర్ గ్రోత్, ప్రమోషన్లు, కొత్త నైపుణ్యాల అభివృద్ధి అవకాశాలు లేకపోతే ఉద్యోగంపై ఆసక్తి తగ్గుతుంది.
గుర్తింపు లేకపోవడం.. శ్రమ దోపిడి
ఎంత కష్టపడినా అప్రిసియేషన్ లేకపోవడం. పని చేసినందుకు తగినంత గుర్తింపు లేదా ప్రశంసలు లేకపోవడం కూడా ఉద్యోగుల్లో నిరుత్సాహాన్ని మరింత పెంచుతుంది. దీంతో చాలామంది ఉద్యోగం మానేయాలనుకుంటున్నారట.
పెరుగుతోన్న ఆఫీస్ పాలిటిక్స్
ఎర్ర జెండాలు: కొత్త ఉద్యోగం లేకుండా ఉద్యోగులు ఎందుకు నిష్క్రమిస్తారు
పని కంటే ఆఫీస్ రాజకీయాలే ఎక్కువ ఇబ్బంది పెట్టడం. మేనేజ్మెంట్ సమస్యలు, సహోద్యోగులతో విభేదాలు, ప్రతికూల వాతావరణం కూడా ఉద్యోగులను జాబ్‌కి దూరం చేస్తున్నాయి.
జీతం విషయంలో రెండు రకాల కారణాలు..
పనిభారం పెరుగుతోంది.. కానీ జీతం మాత్రం అదే అనుకునేవారు. ద్రవ్యోల్బణం, జీవన వ్యయాలు పెరుగుతున్న సమయంలో సరైన వేతనం లేకపోవడం కూడా కీలక కారణం.
అలాగే శాలరీ బాగానే ఉంది.. కానీ ఎమోషనల్‌గా పూర్తిగా అలసిపోయాను అనే భావన పెరగడం కూడా మరో కారణంగా చెప్పవచ్చు. పని గంటలు, నిరంతర ఒత్తిడి, విశ్రాంతి లేకపోవడం వల్ల చాలామంది బర్నౌట్‌కు కొనసాగుతున్నారు.
పర్సనల్ టైం తగ్గిపోవడం
ఆఫీస్ పని ఇంటికీ వస్తోంది.. దీంతో వ్యక్తిగత జీవితానికి సమయం దొరకడం లేదని వాపోయే వారి సంఖ్య పెరుగుతోంది. ఉద్యోగం, కుటుంబం, వ్యక్తిగత సమయం మధ్య లేకపోవడం కూడా రాజీనామా ఆలోచనలకు కారణం.
మానసిక ఆరోగ్యం..
ఉద్యోగుల మానసిక ఆరోగ్యం బర్న్అవుట్
కెరీర్ ముఖ్యం.. కానీ నా ఆరోగ్యం అంతకంటే ముఖ్యమనే ఆలోచన చాలామందిలో పెరుగుతుంది. ముఖ్యంగా కొత్త తరం ఉద్యోగుల జీతం కంటే తమ మానసిక ప్రశాంతత, ఆరోగ్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు.
మంచి అవకాశాల కోసం
ఉద్యోగం మానేయడం కాదు.. నా విలువకు తగ్గ అవకాశం వెతుక్కోవాలనే కోరిక పెరగడం. హైడ్ వర్క్, రిమోట్ జాబ్స్, మెరుగైన కెరీర్ అవకాశాల కోసం చాలామంది కొత్త ఉద్యోగాల వైపు చూస్తున్నారు.
ఒకప్పటిలా ఉద్యోగం మానేయాలనే ఆలోచన జీతం వల్లే ఉండట్లేదు. పని ఒత్తిడి, గుర్తింపు లేకపోవడం, వర్క్-లైఫ్ బ్యాలెన్స్ లోపించడం, మానసిక ఆరోగ్యం వంటి అంశాలు కూడా ఇప్పుడు ముఖ్య పాత్ర పోషిస్తున్నాయి. ప్రస్తుతం చాలామంది ఎక్కువ సంపాదించడం కంటే మంచి, ప్రశాంతమైన లైఫ్ లీడ్ చేయాలనుకుంటున్నారు. అందుకే జాబ్ మానేయాలనుకునేవారి సంఖ్య పెరుగుతుందని చెప్పవచ్చు.
శరీర కొవ్వు కోసం సింపుల్ యోగా | చెడు కొవ్వును సింపుల్ యోగాసనాలతో దూరం చేయండి

