విశాలాంధ్ర ధర్మవరం;; శ్రీ సత్యసాయి విజిలెన్స్ కమిటీ సభ్యులుగా ధర్మవరం కు చెందిన పళ్లెం జనార్ధన ను కలెక్టర్ ద్వారా జిల్లా నియామకం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా ప్రజా పంపిణీ వ్యవస్థ సక్రమంగా అమలు కావడానికి ప్రతి జిల్లాలో ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, సంబంధిత అధికారులతో పాటు వివిధ సంఘాల నుంచి ముగ్గురు శాఖ సభ్యుల కమిటీలను చేర్చుకోవడం జరిగింది.
ఈ కోసం పుట్టపర్తికి చెందిన జి. సురేష్ కుమార్, ధర్మవరం చెందిన పళ్లెం జనార్ధన్, మణిమాలలను జిల్లా విజిలెన్స్ కమిటీ సభ్యులుగా నియమించినట్లు తెలిపారు. జిల్లావ్యాప్తంగా గ్రామ స్థాయి నుంచి ప్రజా పంపిణీ వ్యవస్థలో సమస్యలు ఉన్నా వెంటనే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేశామని, వినియోగదారులు నష్టపోకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు.వినియోగదారుల సంఘాల ప్రతినిధులను జిల్లా విజిలెన్స్ కమిటీలోకి ఎంపిక చేసిన కలెక్టర్, జైంట్ కలెక్టర్, జిల్లా వివిధ జిల్లా సరఫరా శాఖ అధికారిలకు జిల్లా ప్రజా సంఘాల పళ్లెం జనార్ధన కృతజ్ఞతలు తెలిపారు.

