ఢిల్లీ: పెట్రోల్, డీజిల్ అమ్మకాలపై కేంద్ర ప్రభుత్వం ఊరట కలిగించే విషయం చెప్పింది. పెట్రోల్, డీజిల్ అమ్మకాలపై అమల్లో ఉన్న తాత్కాలిక ఆంక్షలను జులై 1 నుంచి ఎత్తేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా హోర్మూజ్ జలసంధి క్లోజ్ అవడం.. ఇంధన సరఫరాకు ఆటంకాలు తలెత్తడం.. ఇలా పలు కారణాల వల్ల.. పారిశ్రామిక, వాణిజ్య అవసరాలకు రిటైల్ ఇంధన కేంద్రాల నుంచి పెట్రోల్, డీజిల్ బల్క్‌లో కొన్ని ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. పెట్రోలియం వస్తువుల సరఫరా పరిస్థితిని సమీక్షించిన ప్రభుత్వం.. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఈ ఆంక్షలు ఇకపై అవసరం లేదని నిర్ధారణకు వచ్చింది.
పెట్రోల్ మరియు డీజిల్ అమ్మకం మరియు పంపిణీని నియంత్రించే తాత్కాలిక నియంత్రణ చర్యలను ప్రభుత్వం ఉపసంహరించుకుంది. @పెట్రోలియం మిన్ జూలై 1, 2026 నుండి అమలులోకి వచ్చేలా, ప్రభుత్వ రంగ రిటైల్ అవుట్లెట్ల ద్వారా మోటార్ స్పిరిట్ మరియు హై స్పీడ్ డీజిల్ నుండి తాత్కాలిక చర్యలు ఎత్తివేయబడతాయి… pic.twitter.com/hp5oELwbgJ
— ఆల్ ఇండియా రేడియో వార్తలు (@airnewsalerts) జూన్ 29, 2026
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కంపెనీ (IOCL), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL), హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) ద్వారా నిర్వహించబడే రిటైల్ అవుట్లెట్ల ద్వారా పెట్రోల్ మరియు డీజిల్ అమ్మకాలు, పంపిణీని నియంత్రించడానికి, మోటారు స్పిరిట్ హైస్పీడ్ డీజిల్ (రిటైల్ అవుట్లెట్ ద్వారా సరఫరాపై తాత్కాలిక నియంత్రణ) ఆర్డర్, జూన్ 2.0262 జులై 1 నుంచి ఈ ఆంక్షలు ఎత్తివేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం.
►ఇంకా చదవండి |సాఫ్ట్వేర్ కోడలికి సిజేరియన్ భయం.. యూట్యూబ్ చూసి పురుడు పోసిన అత్త.. ఆ తర్వాత..
పెట్రోల్, డీజిల్ బంకుల్లో పెద్ద పెద్ద క్యాన్లు, పీపాల్లో పెట్రోల్, డీజిల్ కొట్టొద్దని.. వేల లీటర్లను పీపాల్లో నింపామని.. అలాంటి వాళ్లకు పెట్రోల్, డీజిల్ అమ్మొద్దని కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ జూన్ 12న కఠిన ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. రిటైల్ పెట్రోల్ బంకుల్లో బైక్‌లు, కార్లు, బస్సులు, లారీలు, ఆటోలు ఇలాంటి వాహనాల్లోనే పెట్రోల్, డీజిల్ నింపాలని.. పీపాలు తీసుకొస్తే పోయొద్దని స్పష్టం చేసింది. బల్క్ కొనుగోళ్లపై నిషేధం 90 రోజులు అమల్లో ఉన్నట్లు ప్రకటించినప్పటికీ.. సరఫరాకు ఉన్న అడ్డంకులు తొలగిపోవడంతో ఈ ఆంక్షల నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకుంది.
(ఫంక్షన్(i,s,o,g,r,a,m){i(“GoogleAnalyticsObject”)=r;i(r)=i(r)||ఫంక్షన్(){ (i(r).q=i(r).q||()).push(arguments)},i(r).l=1*new Date();a=s.create m=s.getElementsByTagName(o)(0);a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m)})(window,document,”script”,”https://www.google-analytics.com/analytics.js”,”ga); ga(“సృష్టించు”, “UA-133664641-1”, “ఆటో”); ga(“అవసరం”, “ప్రదర్శన ఫీచర్లు”); ga(“సెట్”, “క్యాంపెయిన్సోర్స్”,”ఫేస్బుక్”); ga(“సెట్”, “క్యాంపెయిన్ మీడియం”, “సోషల్ ఇన్స్టంట్ ఆర్టికల్”); ga(“set”, “title”, ” జులై 1 నుంచి పెట్రోల్, డీజిల్ అమ్మకాలపై ఆంక్షలు ఎత్తివేత”); ga(“పంపు”, “పేజీ వీక్షణ”);

