తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ ఘనంగా నివాళులర్పించారు. హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్దకు ఉదయాన్నే వచ్చి జూనియర్ ఎన్టీఆర్ నివాళులర్పించారు. తెలుగు ప్రజలకు ఎన్టీఆర్ సేవలను ఆయన ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.
ఎన్టీఆర్ ఘాట్ వద్ద…
జూనియర్ ఎన్టీఆర్ ఎన్టీఆర్ ఘాట్ వద్దకు వస్తున్నారని తెలిసి భారీ సంఖ్యలో అభిమానులు చేరుకున్నారు. అలాగే జూనియర్ ఎన్టీఆర్ తో పాటు నందమూరి కుటుంబ సభ్యులు కూడా ఎన్టీఆర్ కు నివాళులర్పించారు. పోలీసులు ఎన్టీఆర్ ఘాట్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

