జూనియర్ ఎన్టీఆర్ బాలకృష్ణ వివాదం: తెలుగు సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతూ ముందుకు దూసుకెళ్తుంది. ఇక ఈ మధ్యకాలంలో తెలుగు నుంచి వచ్చిన సినిమాలన్నీ పాన్ ఇండియాలో సూపర్ సక్సెస్ లను సాధిస్తున్న చాలామంది హీరోలు సైతం సినిమాల మీదనే ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు.. మన హీరోలతో ఇతర భాషల దర్శకులు సైతం సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తంత నీల్ సైతం మన జూనియర్ ఎన్టీఆర్ తో డ్రాగన్ అనే సినిమా చేస్తున్నాడు. ఇక ఎన్టీఆర్ సైతం ఈ మూవీతో సక్సెస్ ను సాధించాల్సిన అవసరం ఉంది. ఇంతకు ఆయన హృతిక్ రోషన్ కలిసి చేసిన ‘2’ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించడానికి ముందు ఆయన మీద ప్రెషర్ అయితే పెరిగింది. ఇప్పుడు ఈ సినిమాతో సూపర్ సక్సెస్ సాధిస్తే అతను స్టార్ హీరోల లిస్టులో ముందుకు వెళతాడు. లేకుంటే ఆయన చాలా వరకు తన మార్కెట్ ను కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చు… ఇక జూనియర్ ఎన్టీఆర్ బయట సక్సెస్ లను సాధించినా కూడా తన ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసిపోలేకపోతున్నాడు.
ముఖ్యంగా బాలకృష్ణకి జూనియర్ ఎన్టీఆర్ కి మధ్య కొన్ని రోజుల నుంచి విభేదాలు ఉన్నాయనే విషయం మనందరికి తెలుస్తుంది. మరి ఎందుకని వీళ్ళ మధ్య మనస్పర్ధలు వచ్చాయనే విషయంలో క్లారిటీ లేదు. కానీ ఇప్పటికైనా కలిసిపోతే చూడాలని ప్రతి ఒక్క ప్రేక్షకుడు కోరుకుంటున్నాడు.
నిజానికి బాలయ్య ఈ విషయంలో మొండిగా వ్యవహరించాడని కూడా చాలా మంది చెబుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్, బాలయ్య బాబు తో కలిసి పోవాలనే ప్రయత్నంలో ఉన్నప్పటికి బాలయ్య మాత్రం ఎన్టీఆర్ ను తనతో కలుపుకోవడానికి సిద్ధంగా లేనట్టుగా తెలుస్తుంది.
ఇక ఏది ఏమైనా కూడా ఎలక్షన్స్ లో జూనియర్ ఎన్టీఆర్ ప్రచారంలో పాల్గొనకపోవడం చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నప్పుడు అసలు ఎన్టీఆర్ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో బాలయ్య అలాంటి ఒక డిసిషన్ తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అందుకే జూనియర్ ఎన్టీఆర్ ను కలవడానికి కానీ అతనితో మాట్లాడడానికి కానీ బాలయ్య ఇష్టపడటం లేదట…

