- UPI చెల్లింపు కొత్త రూల్స్
- ఈ రోజు డబ్బు పంపే విధానాలలో మార్పులు
- బ్యాంకులో నమోదైన అసలు పేరు కనిపించనుంది
డిజిటల్ చెల్లింపులు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో, యూపీఐ (UPI) లావాదేవీలను మరింత సురక్షితంగా ఉంచేందుకు కొత్త మార్పులు అమల్లోకి రానున్నాయి. తెలియని మొబైల్ నంబర్‌కు లేదా క్యూఆర్ కోడ్ ద్వారా చెల్లింపు చేసే సమయంలో వినియోగదారులు మోసాలకు గురికాకుండా ఉండేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నారు. ఈ కొత్త విధానం ద్వారా డబ్బు పంపే ముందు లబ్ధిదారుడి అసలు పేరు స్పష్టంగా కనిపించేలా వ్యవస్థను మెరుగుపరుస్తుంది.
బ్యాంకులో నమోదైన అసలు పేరు కనిపించనుంది
ప్రస్తుతం యూపీఐ యాప్‌లలో (Google Pay, PhonePe, Payt ఇతరాలు) వినియోగదారులకు నచ్చిన పేరును ప్రొఫైల్‌గా పెట్టుకోవచ్చు. దీనితో కొందరు మోసగాళ్లు నకిలీ పేర్లతో ఇతరులను మభ్యపెట్టే అవకాశం ఉంది. కొత్త నిబంధనల ప్రకారం, మీ మొబైల్ నంబర్ లేదా యూపీఐ ఐడీ ద్వారా చెల్లింపు ప్రారంభించినప్పుడు, సంబంధిత బ్యాంకు ఖాతాలో నమోదైన అసలు పేరు తెరపై కనిపిస్తుంది. ఈ చెల్లింపు చేసే వ్యక్తి సరైనవారేనా అని నిర్ధారించుకోవచ్చు.
క్యూఆర్ కోడ్ మోసాలకు చెక్
ఇటీవలి కాలంలో నకిలీ లేదా మార్పులు చేసిన క్యూఆర్ కోడ్ల ద్వారా మోసాలు పెరుగుతున్నాయి. కొత్త వ్యవస్థ అమల్లోకి వచ్చిన తర్వాత, క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసిన వెంటనే డబ్బు జమ కాబోయే ఖాతాదారుడి పేరు స్క్రీన్‌పై కనిపిస్తుంది.
అందుచేత దుకాణాలు, వ్యాపార కేంద్రాలు లేదా వీధి వ్యాపారుల వద్ద చెల్లింపులు చేసే సమయంలో క్యూఆర్ కోడ్ నిజమైనదేనా కాదా అనే వినియోగదారుడు సులభంగా గుర్తించగలరు.
తప్పు ఖాతాలకు డబ్బు వెళ్లకుండా రక్షణ
కొన్నిసార్లు మొబైల్ నంబర్ లేదా యూపీఐ ఐడీ నమోదు చేసే సమయంలో చిన్న పొరపాటు కారణంగా డబ్బు తప్పు ఖాతాకు బదిలీ అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు బ్యాంకులో నమోదైన అసలు పేరు కనిపించడం వల్ల, యూపీఐ పిన్ నమోదు చేసే ముందు లబ్ధిదారుడి వివరాలను మరోసారి ధృవీకరించుకునే అవకాశం లభిస్తుంది. దీనితో పొరపాటున జరిగే లావాదేవీలు తగ్గడంతో పాటు, వినియోగదారుల భద్రత మరింత పెరగనుంది.
డిజిటల్ మోసాలను అరికట్టడమే లక్ష్యం
పెరుగుతున్న సైబర్ మోసాలు, డిజిటల్ ఆర్థిక నేరాలను తగ్గించడమే దేశంలో ఈ మార్పుల ప్రధాన ఉద్దేశమని అధికారులు చెబుతున్నారు. బ్యాంకులు, యూపీఐ ప్రమాణాల మధ్య మెరుగైన సమన్వయం ద్వారా వినియోగదారులకు పారదర్శకమైన, భద్రమైన చెల్లింపు అనుభవాన్ని ఈ చర్యలు మరింతగా తీసుకుంటున్నాయి. అయితే, ఈ మార్పులకు సంబంధించిన అమలు విధానం, సమయపట్టికపై వినియోగదారులు తమ బ్యాంకులు, యూపీఐ సేవా సంస్థల అధికారిక ప్రకటనలను పరిశీలించడం మంచిది.

