సందర్భంగా అవగాహన కార్యక్రమం
విశాలాంధ్ర – అనంతపురం టౌన్ : అనంతపురం జిల్లా ఎస్పీ పి. జగదీష్ ఈ మేరకు అనంతపురం పట్టణంలోని శ్రీ కృష్ణదేవరాయ మున్సిపల్ హై స్కూల్లో , అనంతపురం 2 టౌన్ ఇన్స్పెక్టర్ పుల్లయ్య, ట్రాఫిక్ సెల్స్పెక్టర్ వెంకటేష్ నాయక్, ఈగల్ అనంతపురం ఎస్ ఐ హనుమంతు, ఎన్ఎం బి ఏ ఏ .డి అర్చన మరియు జిహెచ్డి-అడిక్షన్ సెంటర్ సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం మాదకద్రవ్యాలపై అవగాహన కల్పించారు.
సుమారు 350 మంది విద్యార్థులకు డ్రగ్స్ దుష్పరిణామాలపై అవగాహన కల్పించి, సురక్ష వాహనం ద్వారా అవగాహన వీడియోలు ప్రదర్శించారు. నషా ముక్త్ భారత్ అభియాన్ (ఎన్ ఎం బి ఏ ) వాకథాన్ నిర్వహించి ప్రజల్లో చైతన్యం కల్పించారు.
అలాగే ఈగల్ టోల్ ఫ్రీ నంబర్ – 1972 గురించి అవగాహన కల్పించి, ఎన్ ఎం బి ఏ ప్రతిజ్ఞ చేయించారు. డ్రగ్-ఫ్రీ అనంతపురం – డ్రగ్-ఫ్రీ ఇండియా లక్ష్యంతో ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది.
పోస్ట్ జూన్ 26 అంతర్జాతీయ మదక ద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణా నిరోధక దినోత్సవం మొదట కనిపించింది విశాలాంధ్ర.

