తెలంగాణపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఫోకస్ పెట్టారు. జూన్ 2వ తేదీన తెలంగాణ జనసేన నేతలతో పవన్ కళ్యాణ్ సమావేశం కానున్నారు. హైదరాబాద్ వేదికగా పవన్ కళ్యాణ్ సమావేశం జరగనుంది. తెలంగాణలో జనసేన విస్తరణపై దిశానిర్దేశం పవన్ కల్యాణ్ చేయనున్నట్లు తెలిసింది.
పార్టీని బలోపేతంపై…
తెలంగాణలో జనసేన పార్టీని బలోపేతం చేయడంపైనే ఈ సమావేశం జరగనుంది. జూన్ 2వ తేదీన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం కావడంతో ఆరోజు సమావేశమవ్వాలని నిర్ణయించారు. తాజా రాజకీయ నేపథ్యంలో పవన్ కల్యాణ్ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు. రానున్న జీహెచ్‌సీ, భవిష్యత్ ఎన్నికల టార్గెట్‌గా పవన్ వ్యూహరచన చేయనున్నట్టు తెలిసింది.

