హైదరాబాద్ లో వాహనదారులకు నరకం చూపుతోంది. సాయంత్రం కురిసిన భారీ వర్షానికి హైదరాబాద్‌లోని పలు ప్రధాన నగరాలు పూర్తిగా స్తంభించిపోయాయి. ఎక్కడికక్కడ మేర వాహనాలు నిలిచిపోయాయి.
ముఖ్యంగా జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ నుంచి మాదాపూర్, హైటెక్ సిటీ, కూకట్పల్లి నోవాటెల్ రూట్లో పరిస్థితి అత్యంత దారుణంగా మారింది. రోడ్లపై మోకాళ్లలో నీళ్లు నిలవడంతో… వాహనాలు అంగుళం కూడా ముందుకు కదలడం లేదు. సాయంత్రం ఆఫీసుల నుంచి బయల్దేరిన ఐటీ ఉద్యోగులు, వాహనదారులు… రాత్రి 9 గంటలు దాటినా, ఇంకా రోడ్లపైనే నరకయాతన అనుభవిస్తున్నారు.
►ఇంకా చదవండి | వాన బీభత్సం.. ఐటీ కారిడార్ టూ సికింద్రాబాద్ ,ట్యాంక్ బండ్, హైటెక్ సిటీ, కూకట్పల్లి రూట్లలో ఎక్కడికక్కడ నిలిచిన వాహనాలు
జీహెచ్‌సీ (GHMC) డిజాస్టర్ మేనేజ్మెంట్ బృందాలు, ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగి నీటిని క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ట్రాఫిక్ క్లియర్ అవ్వడానికి మరికొంత సమయం పట్టేలా ఉంది. కాబట్టి, ఈ రూట్లలో వారు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. అత్యవసరమైతే తప్ప ఈ రూట్లలో ప్రయాణాలు పెట్టుకోవద్దు.

