జూబ్లీహిల్స్ లో భూ కబ్జా యత్నం వ్యవహారంపై ఇద్దరు సినీ నిర్మాతలపై కేసు నమోదైంది. టాలీవుడ్ నిర్మాతలు సి కళ్యాణ్, బూరుగుపల్లి శివరామకృష్ణలపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. వ్యాపారవేత్త కాంతమనేని రవిశంకర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
జూబ్లీహిల్స్‌లోని ఉమెన్స్ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీకి చెందిన ప్లాట్ నం. 89 వివాదస్పద స్థలమని.. ఆ స్థలంపై కోర్టులో కేసు పెండింగ్‌లో ఉండగా, జూన్ 10న కోర్టు రవిశంకర్ స్వాధీనంలో ఉన్న భూమిపై జోక్యం చేసుకోవద్దని తాత్కాలిక నిషేధాజ్ఞలు జారీ చేసినట్లు పోలీసులు తెలిపారు.
కోర్టు విచారణ నిందితులు అక్రమంగా ప్రవేశించారని ఫిర్యాదులో స్థలం తెలియజేసారు రవిశంకర్. తాళాలు పగులగొట్టి, గేటును ధ్వంసం చేసి, అక్కడి సామగ్రిని చెల్లాచెదురు చేశారన్నారు రవిశంకర్. సిబ్బందిని బెదిరించి, అక్కడ నిర్మించిన గదిని కూడా ధ్వంసం చేసినట్లు ఫిర్యాదులో బాధితుడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

