జ్ఞానేశ్వరి జాడ నేటికీ తెలియలేదు. ఎంతగా ప్రయత్నించినా బాలిక ఆచూకీ మాత్రం కనిపించడం లేదు. కాకినాడ జిల్లా తుని మండలం సీహెచ్ అగ్రహారంలో అదృశ్యమైన రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి జాడ ఇంకా లభించలేదు. జూన్ 6వ తేదీ నుంచి బాలిక కనిపించకుండా పోయింది.
విస్తృతంగా గాలిస్తున్నా…
పోలీసులు, ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బలగాలు విస్తృతంగా గాలింపు చర్యలు చేపడుతున్నాయి. డ్రోన్ కెమెరాలతో అడవి అంతా జల్లెడ పడుతున్నారు. సీసీ కెమెరాలను కూడా సమగ్రంగా పరిశీలించారు. అయినా జ్ఞానేశ్వరి జాడ నేటికీ తెలియకుండా కుటుంబ సభ్యులు ఆందోళనలో ఉన్నారు.

