వ్యాపారం అంటే కేవలం డబ్బు సంపాదించడం.. జనాల ఆరోగ్యం ఏమైపోయినా పర్లేదు.. నాకు డబ్బులు వస్తున్నాయా లేదా.. అన్నట్లు తయారైంది చాలా మంది వ్యాపారుల ధోరణి. ఆ మధ్య ఒకడు మోరీలలో పారే మురుగు నీటిలో కూరగాయరలు, పండ్లు కడిగి దేశం షాకింగ్ కు గురిచేశాడు. వీళ్లు అలాంటోళ్లే.. కూరగాయలను ఏకంగా టాయిలెట్లో స్టోర్ చేస్తూ జనాలు బేవ్ మని వాంతి చేసుకునే దుర్మార్గానికి ఒడిగట్టారు.
ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో ఈ ఘటన జరిగింది. కూరగాయలు అమ్ముకునే వ్యాపారులు, కమీషన్ ఏజెంట్లు కలిసి వెజిటేబుల్స్ ను టాయిలెట్స్ లో స్టోర్ చేస్తూ దొరికిపోయారు. సిటీలోని మవాన నవీన్ సబ్జీ మండిలో ఈ ఘోరమైన పనికి పాల్పడ్డారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
టమాట, బెండకాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఆనంకాయ మొదలైన కూరగాయలను పాలిథీన్ కవర్లలో పెట్టి.. మార్కెట్ దగ్గర ఉన్న మరుగుదొడ్లలో నిలువ ఉంచారు. అయితే చాలా రోజులుగా జామ్ అవ్వడంతో.. టాయిలెట్లు వినియోగంలో లేవని మండి కమిటీ సెక్రటరీ అర్జున్ సింగ్ తెలిపారు.
ప్రధాన ట్రేడింగ్ కంపెనీకి ప్రొప్రెయిటర్ అయిన అభయ్ కుమార్ అనే వ్యక్తి ఈ దారుణానికి పాల్పడ్డాడు. అధికారుల పర్మిషన్ లేకుండా.. నేరుగా టాయిలెట్స్ లో స్టోర్ చేస్తున్నాడు. ఈ విషయం గురించి ఫిర్యాదు అందడంతో మే 15వ తేదీన వెళ్లి ఒక కింటాల్ కూరగాయలను స్వాధీనం చేసుకున్నారు.. ఉపయోగించకుండా పూడ్చిపెట్టినట్లు తెలిపారు.
ఈ వ్యవహారంపై అభయ్ కుమార్ కు నోటీస్ పంపినట్లు చెప్పారు. అయితే వాళ్ల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో లైసెన్స్ రద్దు చేసినట్లు తెలుస్తోంది. మార్కెట్లో ఉన్న టాయిలెట్ రైతులు, కమీషన్ ఏజెంట్లు, కస్టమర్లు వినియోగించేందుకు ఏర్పాటు చేశారు. అయితే అవి డ్యామేజ్ అవ్వడంతో పట్టించుకునేనా నాధుడే లేక అలా పడిపోతున్నాడు. టాయెలెట్స్ జా అవ్వడంతో అప్పటికే దారుణంగా దుర్గంధం వస్తున్న చోట కూరగాయలు దాచడంపై తీవ్ర దుమారం రేపింది.
🚨 షాకింగ్: మరుగుదొడ్డి కూరగాయల మార్కెట్‌గా మారింది #మావానామీరట్: ప్రజల కోసం నిర్మించిన పబ్లిక్ టాయిలెట్ లోపల కూరగాయల మార్కెట్‌గా మారింది.
టాయిలెట్ సీట్ల పక్కనే కూరగాయలు ఉంచుతున్నారు.దాని గురించి ఆలోచించండి: మీరు తినే “తాజా మరియు ఆకుపచ్చ” కూరగాయలు… pic.twitter.com/fk3TgKIqXi
— అమితాబ్ చౌదరి (@MithilaWaaala) మే 17, 2026

