టాటా EV డిస్కౌంట్లు: టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ వాహనాల (EV) ఎత్తు దూసుకుపోతోంది. తాజాగా కస్టమర్ల కోసం ఆకర్షణీయమైన ధర తగ్గింపులను ప్రకటించి, ఎలక్ట్రిక్ కార్లను కొనుగోలు చేసే వారికి గొప్ప సౌకర్యాన్ని కల్పించింది. టాటా తన ఎలక్ట్రిక్ కార్ల శ్రేణిపై మోడల్‌ను బట్టి రూ. 3.35 లక్షల వరకు నగదు ప్రయోజనాలను పొందవచ్చు. ఈ ఆఫర్లు ఎక్స్ఛేంజ్ బోనస్‌లు, స్క్రాపేజ్ ప్రయోజనాలు వేరియంట్ల లభ్యతపై ఆధారపడి ఉంటాయి. ప్రస్తుతం టాటా మోటార్స్ ఆఫర్ చేస్తున్న ప్రధాన కార్ల వివరాలు ఇవే..
టాటా కర్వ్ EV (టాటా కర్వ్ EV):
టాటా ఎలక్ట్రిక్ లైనప్‌లో అత్యధిక డిస్కౌంట్ పొందుతున్న కారు ‘కర్వ్ EV’. ఈ కారుపై ఏకంగా రూ.2.85 నుంచి రూ.3.35 లక్షల వరకు ధర తగ్గింది. ఇది టాటా యొక్క అత్యాధునిక డిజైన్ శైలిని ప్రతిబింబించే కూపే స్టైల్ SUV. అద్భుతమైన ఏరోడైనమిక్స్, శక్తివంతమైన బ్యాటరీ రేంజ్ మరియు లగ్జరీ ఫీచర్లతో రూపొందించిన ఈ కారు, ప్రీమియం ఎలక్ట్రిక్ సెగ్మెంట్లో కస్టమర్లను విశేషంగా ఆకట్టుకుంటోంది.
టాటా హారియర్ EV (టాటా హారియర్ EV)
టాటా హారియర్ EVపై సుమారు రూ.2.75 లక్షల వరకు ప్రయోజనాలను సంస్థ అందిస్తోంది. హారియర్ దాని బోల్డ్ లుక్, దృఢమైన నిర్మాణం ప్రసిద్ధి. ఎలక్ట్రిక్ రూపంలో ఇది మరింత శక్తివంతమైన పర్ఫామెన్స్ ను అందిస్తూ సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందిస్తుంది. కుటుంబ అవసరాలకు సరిపోయేలా విశాలమైన లోపలి భాగం లో అధునాతన సేఫ్టీ ఫీచర్లు ఇందులో ఉంటాయి.
టాటా పంచ్ EV (టాటా పంచ్ EV):
కాంపాక్ట్ ఎట్రిక్ SUV పట్టరుగులేని కారుగా పంచ్ EV. దాదాపు రూ. 95,000 వరకు డిస్కౌంట్ అందుబాటులో ఉంది. నగర ప్రయాణాలకు అత్యంత అనువైనదిగా.. సులభమైన హ్యాండ్లింగ్‌తో పాటు బ్యాటరీ సామర్థ్యం కలిగి ఉంది. మొదటిసారి EV కొనుగోలు చేసే వారికి ఇది ఒక చక్కని ఎంపికగా నిలుస్తుంది.
టాటా టియాగో EV & నెక్సాన్ EV (Tiago EV & Nexon EV):
బడ్జెట్ ఎలక్ట్రిక్ కారు కావాలనుకునే వారి కోసం టియాగో EVపై రూ.65,000 వరకు డిస్కౌంట్ లభిస్తోంది. చిన్న కుటుంబాలకు, సిటీ డ్రైవింగ్‌కు ఇది చాలా ఉంటుంది. మరోవైపు, దేశంలోనే అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ SUV అయిన ‘నెక్సాన్ EV’పై రూ. 50,000 వరకు ధర తగ్గింపును టాటా ప్రకటించింది. అద్భుతమైన బిల్డ్ క్వాలిటీ, మంచి రేంజ్, టాటా యొక్క నమ్మకమైన సర్వీస్ ఈ కార్లను ప్రత్యేకంగా నిలబెడుతోంది.

