టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ వాహనాలపై భారీ డిస్కౌంట్లను ప్రకటించింది: ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ టాటా మోటార్స్ తన ఎలక్ట్రిక్ వెహికల్ (EV) లైనప్ పై జూన్ నెల ఆఫర్లను అనౌన్స్ చేసింది. ఈ సెల్ లో సెలెక్టెడ్ మోడల్స్ పై తాజాగా రూ. 3.35 లక్షల వరకు బెనిఫిట్స్ అందుకోవచ్చు. కొత్త కార్లతో పాటు పాత స్టాక్ పై కూడా ఈ ఆఫర్లు వర్తిస్తాయి. ఇందులో గ్రీన్ బోనస్, ఎక్స్ఛేంజ్ బెనిఫిట్స్, స్క్రాపేజ్ ఆఫర్స్, లాయల్టీ బోనస్ లు ఉన్నాయి.
ఇది కూడా చదవండి: మొదటి E85 ఇంధన స్టేషన్: ఢిల్లీలో దేశంలోనే తొలి E85 ఫ్యూయల్ స్టేషన్ ప్రారంభం! లీటర్ పెట్రోల్‌పై 20 రూపాయలు అదా!
టాటా కర్వ్ ఈవీ, హారియర్ ఈవీలపై అదిరిపోయే ఆఫర్లు..
టాటా కర్వ్ ఈవీ (Curvv EV) మోడల్ పై ఈ నెలలో అత్యధికంగా డిస్కౌంట్లు ఉన్నాయి. ఆటని సెలెక్టెడ్ నాన్-ఎక్స్ వేరియంట్లపై రూ. 3 లక్షల గ్రీన్ బోనస్, రూ. 30,000 ఎక్స్ఛేంజ్ ఆఫర్‌తో కలిపి మొత్తం రూ. 3.35 లక్షల వరకు తగ్గనుంది. క్రియేటివ్ వేరియంట్లపై రూ. 2.85 లక్షల వరకు ఆఫర్ ఉంది. హారియర్ ఈవీ (Harrier EV) అన్ని వేరియంట్లపై రూ. 2.75 లక్షల వరకు బెనిఫిట్ లభిస్తుంది. ఇందులో రూ. 1 లక్ష లాయల్టీ బోనస్ తో పాటు అదనంగా మరో రూ. 1 లక్ష బెనిఫిట్ యాడ్ అయింది.
Read Also: Petrol Diesel Price Hike: పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతాయా? చమురు కంపెనీల నిర్ణయానికి కారణాలివే
పంచ్ ఈవీ, టియాగో ఈవీలపై క్యాష్ బ్యాక్ అప్డేట్స్..
టాటా పంచ్ ఈవీ (పంచ్ EV) మోడల్స్ పై రూ. 95,000 నుంచి రూ. 1.45 లక్షల వరకు డిస్కౌంట్లు ఉన్నాయి. లాంగ్ రేంజ్ (LR) వేరియంట్ల పై రూ. 1.45 లక్షలు, మీడియం రేంజ్ (MR) వేరియంట్లపై రూ. 1.25 లక్షల వరకు ఆఫర్లు ఉన్నాయి. టాటా టియాగో ఈవీ (Tiago EV) పాత మోడల్స్ పై రూ. 65,000 నుంచి రూ. 1.45 లక్షల వరకు తగ్గింపు లభిస్తుంది. దీని ఎల్ఆర్ ఎక్స్‌టీ వేరియంట్ పై అత్యధికంగా రూ. 1.45 లక్షల బెనిఫిట్ ఉంది. మొత్తానికి మధ్య తరగతి ప్రజలు అత్యంత ఉత్సాహం చూపించే టియాగో, పంచ్ కార్లపై ఆఫర్లు పెట్టడంతో వాటి సేల్స్ పెరుగుతాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
నెక్సాన్ ఈవీపై డిస్కౌంట్ ఆప్షన్లు..
టాటా నెక్సాన్ ఈవీ (Nexon EV) అన్ని వేరియంట్లపై రూ. 50,000 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. ఇందులో రూ. 15,000 గ్రీన్ బోనస్, రూ. 25,000 ఎక్స్ఛేంజ్ బెనిఫిట్ లేదా రూ. 35,000 స్క్రాపేజ్ బెనిఫిట్ ఉన్నాయి. అయితే ఎక్స్ఛేంజ్, స్క్రాపేజ్ ఆఫర్లలో ఏదో ఒకటి మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. ఈ ఆఫర్లు డీలర్షిప్ లొకేషన్, స్టాక్ అవైలబిలిటీ ఆధారంగా మారే ఛాన్స్ ఉన్నందున కస్టమర్లు దగ్గరలోని షోరూమ్‌లో కన్ఫర్మ్ చేసుకోవాలని కంపెనీ తెలిపింది.
Auto Expo 2023 Day 1 Highlights: ఎంతో హైప్ తో మొదలైన ఆటో ఎక్స్ పో మొదటి రోజు హైలైట్స్

