టాప్ 5 మూవీస్ ఫస్ట్ వీక్ కలెక్షన్స్: రామ్ చరణ్ ‘పెద్ది’ చిత్రం విడుదలై విజయవంతంగా వారం రోజులు పూర్తి చేసుకుంది. ఈ వారం రోజుల్లో ఈ చిత్రం కొన్ని ప్రాంతాల రీసెంట్ సూపర్ హిట్స్ దేవర , ఓజీ చిత్రాలను దాటేసింది. కొన్ని సెంటర్స్ లో అయితే #RRR రికార్డ్స్ ని కూడా బద్దలు కొట్టింది. సరికొత్త బెంచ్ మార్క్స్ ని క్రియేట్ చేస్తూ ముందుకు దూసుకెళ్తుంది. ఇదంతా పక్కన పెడితే తెలుగు రాష్ట్రాల్లో మొదటి వారం అత్యధిక వసూళ్లను రాబట్టిన టాప్ 5 సినిమాలు ఏంటి?, పెద్దింటికి ఏ స్థానం లో ఉంది అనేది ఇప్పుడు వివరంగా చూడబోతున్నాం.
1) #RRR : రామ్ చరణ్ , ఎన్టీఆర్ , రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద కాస్త డివైడ్ టాక్ వచ్చినప్పటికీ , ఫ్యామిలీ ఆడియన్స్ కి ఈ చిత్రం విపరీతంగా నచ్చడంతో సెన్సేషనల్ వసూళ్లను నమోదు చేసుకుంది. ఈ చిత్రం మొదటి వారంలో తెలుగు రాష్ట్రాల నుండి 187 కోట్ల 25 లక్షల రూపాయల షేర్ వసూళ్లు వచ్చాయి.
2) పుష్ప 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ సినిమా, కనీవినీ ఎరుగని రేంజ్ భారీ అంచనాల నడుమ విడుదలై, మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో మొదటి వారం ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల నుండి 158 కోట్ల 21 లక్షల రూపాయల షేర్ వసూళ్లు వచ్చాయి.
3) కల్కి 2898 AD : రెబల్ స్టార్ ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ వెండితెర అద్భుతం గురించి ఎంత మాట్లాడినా తక్కువే అవుతుంది. మొదటి ఆట నుండే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల నుండి 134 కోట్ల 25 లక్షల రూపాయల షేర్ వసూళ్లు.
4) పెద్ది : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ సెన్సేషన్ ‘పెద్ది’ ప్రీమియర్ షో నుండి బ్లాక్ బస్టర్ టాక్ ని సొంతం చేసుకొని సంచలనం సృష్టించింది. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ చిత్రం బంపర్ ఓపెనింగ్స్ వచ్చాయి , మొదటి వారం కూడా కళ్ళు చెదిరే వసూళ్లు వచ్చాయి. ట్రేడ్ పండితులు అందించిన సమాచారం ప్రకారం ఈ చిత్రం మొదటి వారంలో 125 కోట్ల 86 లక్షల రూపాయల షేర్ వసూళ్లు
5) ఓజీ : పవన్ కళ్యాణ్ సుజిత్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ చిత్రం కనీవినీ ఎరుగని రేంజ్ భారీ అంచనాల నడుమ విడుదలై మొదటి ఆట నుండే డివైడ్ టాక్ సొంతం చేసుకుంది. కానీ పవన్ కళ్యాణ్ స్టార్ పవర్ కారణంగా ఈ సినిమా భారీ వసూళ్లను రాబట్టి సెన్సేషన్ సృష్టించింది. మొదటి వారంలో ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల నుండి 121 కోట్ల రూపాయల షేర్ వసూలు చేసింది.

