తెలంగాణలో సినిమా టికెట్ల రేట్ల పెంపు వ్యవహారం ఒక ఎడతెగని పంచాయితీగా మారుతోంది. నిర్మాతలు రేట్ల పెంపు కోసం ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుని కళ్లు కాయలు కాచేలా ఎదురు చూడడం.. చివరి నిమిషంలో ప్రభుత్వం అనుమతులు ఇవ్వడం.. తర్వాత ఎవరో ఒకరు రేట్ల పెంపుపై కోర్టు మెట్లెక్కడం.. కోర్టు ప్రభుత్వాన్ని మందలించడం, రైలు పెంపుపై స్టే విధించడం.. ఇదీ వరస.
సంక్రాంతి సినిమా ‘మనశంకర వరప్రసాద్ గారు’ విడుదల రేట్లు పెంచడం మీద సీరియస్.. ఇకపై ఏదైనా కొత్త సినిమా ధరలు పెంచాలంటే 90 రోజుల ముందు దరఖాస్తు చేసుకోవాలంటూ ప్రకటించడం తెలిసిందే. ఈ దాని మీద స్టే కోసం ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. అయినా సరే.. ఇటీవల ‘పెద్ది’ సినిమా రేట్లు పెంచడానికి ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది.
ప్రిమియర్స్‌కు రూ.600 రేటు పెట్టగా.. తొలి రోజు నుంచి పదో రోజు వరకు సింగిల్ స్క్రీన్లలో రూ.100, మల్టీప్లెక్సుల్లో రూ.125 రేట్లు పెంచారు. ఆ ప్రకారమే సినిమా ఆడుతుండగా.. ఇప్పుడు రేట్ల పెంపు మీద కోర్టు పిటిషన్ దాఖలవడం చర్చనీయాంశంగా మారింది.
జీవో 151ను పక్కన పెట్టి ఈ రెండో నెల తారీఖున ‘పెద్ది’ టికెట్ల ధరల పెంపు కోసం ప్రత్యేక జీవో జారీ చేసింది.
ఈ పిటిషన్‌ను పరిశీలించిన హైకోర్టు… ధరల పెంపు జీవోపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ తదుపరి విచారణను ఈ నెల 15కి వాయిదా వేసింది. ప్రాథమికంగా హైకోర్టు స్పందన చూస్తే.. టికెట్ల రేట్ల పెంపు విషయంలో మరోసారి ప్రభుత్వానికి అక్షింతలు పడేలా ఉన్నాయి. కానీ రేట్ల పెంపుపై హైకోర్టులో ప్రతిసారీ సీరియస్ అవుతున్నప్పటికీ, స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినప్పటికీ.. ప్రభుత్వం దాన్ని మీరి రేట్ల పెంపుదలకు ఎందుకు అనుమతులు ఇస్తున్నాయి.
తెలంగాణలోని మల్టీప్లెక్సుల్లో టికెట్ ధర రూ.295గా ఉంది. సౌత్ ఇండియాలో మరెక్కడా మల్టీప్లెక్స్‌లో ఇంత రేటు లేదు. దాని మీద కొత్త సినిమాలకు మళ్లీ రూ.125 వడ్డించడం పట్ల ప్రేక్షకుల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అయినా నిర్మాతలు రేట్ల పెంపు అడగడం.. ప్రభుత్వం అనుమతి ఇవ్వడం అన్నది ఎంత వరకు సమంజసమన్న ప్రశ్న.

