రామవరం, జూలై 10 : నాగయ్యగడ్డలోని (టీజీడబ్ల్యూయూఆర్జేసీ) గురుకుల పాఠశాలలో యూపీహెచ్సీ రామవరం ఆధ్వర్యంలో శుక్రవారం ఆరోగ్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ వి.సరిత పూర్తి. శిబిరంలో హెల్త్ ఎడ్యుకేటర్ ఏ.జయలక్ష్మి విద్యార్థులకు వ్యక్తిగత పరిశుభ్రత, హ్యాండ్‌వాష్ టెక్నిక్స్, వర్షాకాలంలో తీసుకోవాల్సిన ఆరోగ్య జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. హెల్త్ మేనేజర్ వి.శ్రీనివాసరావు జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవం (NDD) ప్రాముఖ్యతను వివరించారు.
ఈ నెల 13వ తేదీన నిర్వహించనున్న కార్యక్రమంలో 1 నుంచి 19 సంవత్సరాల వయస్సు గల పిల్లలందరూ తప్పనిసరిగా ఆల్బెండజోల్ మాత్రలు మింగాలని సూచించారు. దీనితో కడుపులోని నులి పురుగులు నశించి, రక్తహీనత తగ్గడం, ఆకలి పెరగడం, ఆరోగ్యం మెరుగుపడటం, పాఠశాల హాజరు పెరగడం, ఆటపాటల్లో శిక్షణలో పాల్గొనడం వంటి ప్రయోజనాలు ఉంటాయని విద్యార్థులకు వివరించారు. అలాగే ఐదుగురు విద్యార్థులకు హెచ్‌పీవీ వ్యాక్సిన్‌పై అవగాహన కల్పించి, టీకాలు ఏర్పాటు. ఈ కార్యక్రమంలో స్కూల్ స్టాఫ్ నర్సు జి.రమ్య, ఏఎన్ఎంలు బి.తార, పి.శ్రీలక్ష్మి, ఆశా కార్యకర్త టి.రాజమణి ఉన్నారు.
టీజీడబ్ల్యూఆర్‌జేసీ విద్యార్థినులకు హెచ్‌పీవీ టీకాలు

